వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వెంకీ మామ సినిమాను ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు. అయితే సినిమాలో అన్ని వర్గాలను ఆకర్షించే మంచి సందేశం కూడా ఉంటుందట. 

మెయిన్ గా పొలిటికల్ పాయింట్ కూడా సినిమాలో ఒక హైలెట్ పాయింట్ అని తెలుస్తోంది. రీసెంట్ గా ఒక షెడ్యూల్ ని ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెట్టింది. అక్కడ వెంకటేష్ - నాగ చైతన్య ల మధ్య ఒక పొలిటికల్ ఎపిసోడ్ ని తెరకెక్కిస్తున్నారు. 

ఈ ఎపిసోడ్ సినిమా కథలో కీలకం కానుందని సమాచారం. త్వరలోనే సినిమాకు సంబందించిన మరో పోస్టర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది.  సురేష్ ప్రొడక్షన్ - పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సినిమాలో రాశి ఖన్నా.. ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.