వరుస అపజయాలతో కొన్నేళ్ళవరకు సతమతమైన విక్టరీ వెంకటేష్ ఎట్టకేలకు F2 సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకటేష్ నెక్స్ట్ మరో మల్టీస్టారర్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ అనే సినిమా చేస్తున్నాడు. 

ఆ సినిమా అనంతరం వెంకీ ఎలాంటి సినిమా చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. చాలా మంది దర్శకులు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన వెంకీ ముందుగా త్రినాథరావుతో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అందుకు కారణం త్రివిక్రమ్ ప్రాజెక్టు అని తెలుస్తోంది. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న కథలలో తొందరగా ఫినిష్ చేసే కథను  త్రినాథరావు సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆ ప్రాజెక్ట్ మూడు నెలల్లో ఫినిష్ చేయవచ్చని టాక్. వెంకీ మామ ఇప్పటికే పూర్తి కావడానికి వచ్చింది. ఇక అక్టోబర్ లో ఆ సినిమాను రిలీజ్ చేసి నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో త్రినాథ్ రావ్ సినిమాను ఫినిష్ చేయాలనీ విక్టరీ హీరో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ లోపు త్రివిక్రమ్ బన్నీ సినిమా రిలీజవుతుంది కాబట్టి అతనితో కమిటైన సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నట్లు సమాచారం.