దువ్వాడ జగన్నాథమ్ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ నెక్స్ట్ వాల్మీకి సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగర్తాండ సినిమాకు రీమేక్ గా తెరకెక్కతున్న ఈ సినిమాలో మెగా యువ హీరో వరుణ్ తేజ్ డిఫరెంట్ రఫ్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 13న రిలీజ్ కానుంది. 

దీంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ తో చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక సినిమా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి రెగ్యులర్ ప్రమోషన్ డోస్ పెంచేందుకు దర్శకుడు హరీష్ శంకర్ సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. 

మరికొన్ని రోజుల్లో డబ్బింగ్ పనులను పూర్తి చేసి హీరో కూడా ప్రమోషన్స్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నాడు. కోలీవుడ్ కుర్ర హీరో అథర్వ ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.