ఆగస్ట్ 15న పాజిటివ్ వైబ్రేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణరంగం - ఎవరు రెండు సినిమాలు కూడా ఊహించని రిజల్ట్ ని అందుకున్నాయి. ఎవరు సినిమా ఉహించినదానికంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుండగా రణరంగం మాత్రం మిక్సిడ్ టాక్ తో కాస్త వెనకబడింది. మొదట ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. 

ఇకపోతే ఎవరు సినిమా యూఎస్ లో సాలిడ్ డాలర్స్ ని రాబడుతుంటే రణరంగం మాత్రం నెమ్మదిగా వెళుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రణరంగం మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. యూఎస్ బాక్స్ ఆఫీస్ రణరంగంలో ఎవరు సినిమా ముందు వరుసలో ఉంది. గురువారం $43,320 గ్రాస్ సాధించిన ఎవరు తాజాగా అందిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు యూఎస్ లో $1,21,822 గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు టాక్. 

శర్వా రణరంగం సిసినిమాకు యూఎస్ ప్రీమియర్స్ లేకపోవడం మైనెస్ గా మారింది. గురువారం ఈ మూవీకి $24,014 గ్రాస్ వసూళ్లు అందగా  తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు రణరంగం సినిమాకు $27,892 గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే దక్కినట్లు తెలుస్తోంది. మరి వీకెండ్స్ లో ఈ రెండు సినిమాలు ఎంతవరకు పుంజుకుంటాయో చూడాలి.