గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను ఒకే చేస్తోన్న విక్టరీ వెంకటేష్ డేట్స్ గురించి అస్సలు ఆలోచించడం లేదు. కొంచెం ఆలస్యమయినా పరవాలేదంటూ కథ నచ్చితే వెంటనే ఒప్పేసుకుంటున్నాడు. ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో పాటు మరో నాలుగు ప్రాజెక్టులను లైన్ లో ఉంచాడు. 

అయితే అందులో ఒక సినిమా వెంకీ కెరీర్ లోనే చాలా డిఫరెంట్ గా నిలవనుందని సమాచారం. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో చేయనున్న సినిమాలో వెంకీ గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తాడట. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమా హార్స్ రైడింగ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుందని సమాచారం. 

వెంకీ మామ అనంతరం వెంకటేష్ హార్స్ రైడింగ్ కి సంబందించిన వర్క్ షాప్ లో పాల్గొననున్నాడు. సురేష్ బాబు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.