మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా ఎప్పుడు రిలీజవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంత కాలంగా సినిమా రిలీజ్ డేట్ పై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాను ఈ ఏడాది మధ్యలోనే రిలీజ్ చేస్తామని చిరు తనయుడు, సినిమా నిర్మాత రామ్ చరణ్  చెప్పినప్పటికి ఇంకా ఆ విషయంలో క్లారిటీ లేదు. 

చరణ్ చెప్పినదాన్ని బట్టి ఆగస్ట్ లోనే సినిమా రిలీజ్ కావలి. అయితే సినిమా ఇప్పుడు అక్టోబర్ కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆగష్టు లో సాహో సినిమా బారి స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద బడా సినిమాల మధ్య ఫైట్ మంచిది కాదని ఇరు సినిమాల నిర్మాతలు ముందే ఒక ఒప్పందం కుదుర్చుకొని రిలీజ్ డేట్ పై ఒక నిర్ణయానికి వచ్చేశారు. 

సైరా సినిమా ఆగస్ట్ 15కి రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. ఇక ఇప్పుడు షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు సినిమాను రిలీజ్ చెయ్యాలని రామ్ చరణ్ ఫిక్సయినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో కొణిదెల ప్రొడక్షన్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రానుందని సమాచారం.