రంగస్థలం సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకొని స్టార్ దర్శకుడిగా మారిన సుకుమార్ అంటే ఇప్పుడు హీరోలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు కథలను వినడానికి రెడీగా ఉన్నారు. అయితే ముందుగానే మహేష్ సుకుమార్ తో చేయడానికి సిద్దమయ్యాడు. 

మహర్షి అయిపోగానే సినిమా మొదలెడదాం అని మహేష్ మాట కూడా ఇచ్చాడు. అయితే సుకుమార్ రెండు కథలను వినిపించగా వాటిని మహేష్ అంతగా ఇష్టపడలేదని ఇటీవల మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో సుకుమార్ తన టీమ్ తో సరికొత్తగా ఒక డిఫరెంట్ యాక్షన్ ప్యాకిడ్ కథను సెట్ చేసుకొని సిద్ధంగా ఉన్నాడు. తప్పకుండా కలుస్తానని సుకుమార్ ని మహేష్ ఇటీవల హోల్డ్ లో పెట్టాడు. 

అందుకే వేరే పనులున్నా కూడా సుకుమార్ అవన్నీ పక్కనపెట్టేశాడట. అయితే మహేష్ మాత్రం అమెరికా నుంచి ఇండియా రాకుండా అటు నుంచి ఆటే దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇక్కడ సుకుమార్ ఏమో మహేష్ ఎప్పుడు వస్తాడా అని దీర్ఘంగా ఎదురుచూస్తున్నాడు. మరి మహేష్ ఈ సారి చెప్పిన సుక్కు కథను ఒప్పుకుంటాడో లేదో..