గత ఏడాది మహానుభావుడు సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న యువ హీరో శర్వానంద్ నెక్స్ట్ సినిమా కోసం సమయం చాలానే తీసుకుంటున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కూడా విడుదలై అందరిని ఆకట్టుకుంది. 

అయితే ఆ సినిమా విడుదలపై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. ముందుగా చిత్ర యూనిట్ ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. అయితే రీసెంట్ గా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందు వల్ల సినిమా రిలీజ్ నెక్స్ట్ ఇయర్ కి వాయిదా పడినట్లు టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. 

సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి అనుమానం లేదని డిసెంబర్ 21న పడి పడి లేచే మనసు రిలీజ్ కానుందని వివరణ ఇచ్చారు. ఇక అదే రోజు వరుణ్ తేజ్ స్పెస్ థ్రిల్లర్ అంతరిక్షం కూడా రిలీజ్ కానుంది. మరి డిఫరెంట్ జానర్స్ లో వస్తోన్న ఈ లవ్ స్టోరీ అండ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఏది ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి.