దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ ఒకప్పటిలా ఇండస్ట్రీ హిట్స్ అందుకోవడం లేదు. దీంతో నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి భయపడుతున్నట్లు అర్ధమవుతోంది. మనోడి ఖర్చు చేసే విధానానికి నిర్మాతలు ముందే డబ్బు మీద ఆశలు వదులుకోవాలి. ఒకప్పుడు లాభాలు వచ్చినా.. ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. 

ఇక రీసెంట్ గా కమల్ హాసన్ భారతీయుడు సీక్వెల్ కి శంకర్ ఒక బడ్జెట్ ని ఫిక్స్ చేసుకోకపోవడంతో లైకా సంస్థ శంకర్ కు కౌంటర్ ఇచ్చినట్లు కోలీవడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. లైకా సంస్థ ఇండియన్ 2ని ఆపేస్తున్నట్లు టాక్ వస్తోంది. శంకర్ తో ఓ సినిమా చేయాలంటే బడ్జెట్ లిమిట్ లో ఉండదని సినిమా పూర్తయ్యే వరకు నిర్మాతలకు కూడా తెలియదు. 

2.0 సినిమా బడ్జెట్ లో ఏం జరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు కూడా ఒక ఫిగర్ ని ఫిక్స్ చేసుకోకపోతుండడంతో లైకా ప్రొడక్షన్ టీమ్ శంకర్ తో సినిమా చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. శంకర్ ఊహలకు మొదట్లో నిర్మాతలు ఎంత కావాలంటే అంత ఇచ్చే వారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. బడ్జెట్ నెంబర్స్ ని ఫిక్స్ చేస్తే గాని శంకర్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అవ్వడం లేదు. 

దిల్ రాజుతో మొదట ఈ సీక్వెల్ ను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ దిల్ రాజు అంత రిస్క్ చేయాలనీ అనుకోలేదు. ఇక ఇప్పుడు లైకా కూడా అదే తరహాలో ఆలోచిస్తోంది. దీంతో శంకర్ చేసేదేమి లేక బాలీవుడ్ నుంచి ఒక ప్రొడక్షన్ ను అలాగే టాలీవుడ్ నుంచి ఒక బడా నిర్మాతను ఒకటిగా చేసి భారతీయుడు 2 సినిమాను నిర్మించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ లైకా సంస్థలో ఇదివరకే మొదలైంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.