టాలీవుడ్ బడా మల్టీస్టారర్ RRR పై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పడానికి దర్శకుడు రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. నార్త్ అండ్ సౌత్ మీడియా మొత్తం ఈ మీటింగ్ కోసం వెయిట్ చేస్తోంది. హైదరాబద్ లోని పార్క్ హయత్ లో నిర్వహించనున్న ఈ ప్రెస్ మీట్ లో కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నారు. 

మొదటి సారి ఈ స్టార్ హీరోలద్దరు కలిసి మీడియా ముందుకు వస్తుండడంతో వారు ఏ విధంగా స్పందిస్తారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెయిన్ హీరోయిన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని కలకత్తా లో నిర్వహించనున్నారు. ఈ నెల 14న  జక్కన్న మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇక సంగీత దర్శకుడు కీరవాణి తన పనులను కూడా మొదలు పెట్టేశారు. సినిమా కోసం స్పెషల్ మ్యూజిక్ టచ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది.