ప్రతి సినిమాతో తనలోని సరికొత్త నటుడిని ఆవిష్కరించుకుంటున్న రానా విలన్ - హీరో అని తేడా లేకుండా డిఫరెంట్ సినిమాలతో ముందుకు సాగుతున్నాడు. అయితే ఇంత వరకు సోలోగా సక్సెస్ లేని రానా దగ్గుబాటి 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రయోగానికి సిద్దమైనట్లు సమాచారం. 

గత కొంత కాలంగా సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తో రానా ఒక స్క్రిప్ట్ తో బిజీగా ఉన్నట్లు అనేక కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. హిరణ్యకశ్యప అనే పౌరాణిక సినిమాను భారీ విజువల్స్ తో తెరకెక్కించడానికి గుణశేఖర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యింది. గత కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా గ్రాఫిక్స్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. 

అయితే ఇంతవరకు రానా - గుణశేఖర్ కెరీర్ లలో 200 కోట్ల బిజినెస్ ఎన్నడూ చేయలేదు. పైగా గుణశేఖర్ మీద నమ్మకంతో రానా సొంత ఖర్చుతో సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి భారీ సెట్స్ తో కొత్త ఏడాది సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.