సూపర్ స్టార్ రజిని కాంత్ ప్రస్తుతం మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంటోంది. చాలా కాలం తరువాత సూపర్ స్టార్ ఒక పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే నెక్స్ట్ సినిమాను కూడా రజినీ వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని చూస్తున్నాడు. 

వచ్చే ఎలక్షన్స్ లో రజిని బిజీ కానున్నట్లు రోజుకో కథనం అభిమానులను కలవరపెడుతోంది. అయితే తలైవా మాత్రం ఇంకా ఎలాంటి పొలిటికల్ అడుగులు వేయడం లేదు. ఆ లోపు మంచి సందేశాత్మక చిత్రాలతో అభిమానులను ఎట్రాక్ట్ చేయాలనీ చూస్తున్నాడు. రీసెంట్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో కూడా రజిని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో చాలా సార్లు ఈ కాంబినేషన్ పై కామెంట్స్ వినిపించాయి. 

గౌతమ్ కూడా సూపర్ స్టార్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెబుతూ వస్తున్నాడు. ఫైనల్ గా ఒక పాయింట్ ని ఒకే చేసుకొని కథను డెవెలప్ చేయడానికి దర్శకుడు రెడీ అయినట్లు టాక్. ఇక మురగదాస్ తో చేస్తోన్న దర్బార్ సినిమాను సంక్రాంతి కానుకగా తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయాలనీ రజినీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నారు.