అక్కినేని యువ హీరో నాగ్ చైతన్య బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ అనంతరం మొత్తానికి సతీమణితో నటించి మజిలీతో సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా తరువాత ఫామ్ లోకి వచ్చిన చైతు నెక్స్ట్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

మామ వెంకటేష్ తో నటిస్తున్న ఈ మల్టీస్టారర్  సినిమా దసరా అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే త్వరలో చైతు మరో కొత్త ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న బంగార్రాజు కథలో చైతు తండ్రితో కలిసి నటించబోతున్నాడు. ముందుగా చైతూకి సంబందించిన షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొదలుకానుందట. 

ఇప్పటికే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఫుల్ స్క్రిప్ట్ ను సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో కలిసి ట్యూన్స్ రెడీ చేయించుకుంటున్నట్లు సమాచారం. నాగార్జున - నాగ చైతన్య రెడీ అయ్యే లోపు మ్యూజిక్ కి సంబందించిన పనులను ఫినిష్ చేయాలనీ దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.