కరెక్ట్ గా షష్టి పూర్తి చేసుకునే వయసులో నవ మన్మథుడిగా కనిపించడానికి కింగ్ నాగార్జున మరోసారి సిద్దమయ్యాడు. ఆగష్టు 29 వస్తే సరిగ్గా ఆరు పదుల వయసులోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున అదే సమయంలో యంగ్ గా స్క్రీన్ పై కనిపించి అందరికి సరికొత్త కిక్ ఇవ్వనున్నాడు. నాగ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. 

గత కొంత కాలంగా సినిమాకు సంబంధించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫైనల్ గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కథకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో సినిమాను సొంత బ్యానర్ లోనే నాగ్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. మార్చ్ 12న మన్మథుడు 2 సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లో స్టార్ట్ చేసేందుకు ముగుర్తం సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా యూరోప్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సినిమాలో చాలా కాలం తరువాత నాగార్జున సతీమణి అమల గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. ఈ సినిమాలో నాగ్ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని టాక్. అందులో యువకుడిగా కనిపించే నాగ్ పాత్ర మెయిన్ హైలెట్ అని సమాచారం.