కొన్ని క్లాసిక్ సినిమాలు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. అలాంటి సినిమాల్లో మన్మధుడు కూడా ఒకటి. నాగార్జున కామెడీ పెర్ఫామెన్స్ - త్రివిక్రమ్ మాటలు అలాగే విజయ భాస్కర్ డైరెక్షన్ అన్ని కరెక్ట్ గా సెట్టవ్వడంతో 2002లో వచ్చిన ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 

ఇక 15 ఏళ్ల తరువాత ఆ సినిమాకు సంబందించిన సీక్వెల్స్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. "చి ల సౌ" సినిమాకు దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రన్ ఈ మన్మధుడు సీక్వెల్ కు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.  అప్పట్లో నాగార్జున స్టార్ డమ్ కి తగ్గట్టు ఆ సినిమా బాగానే వర్కౌట్ అయ్యింది.అయితే ఇప్పటివరకు రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఎన్నో వచ్చాయి. 

అలాంటిది ఇప్పుడు సీక్వెల్ వస్తోంది అంటే అంచనాలు బాగానే ఉంటాయి కానీ సినిమాను ఆ రేంజ్ లో తెరకెక్కిస్తారు అనే సందేహం రాకుండా ఉండదు. పెద్దగా అనుభవం లేని రాహుల్ ఎంతవరకు ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తాడో చూడాలి మరి. ఇక త్వరలోనే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసి అన్నపూర్ణ బ్యానర్ లోనే సినిమాను నిర్మించాలని నాగ్ సన్నాహకాలు చేస్తున్నట్లు సమాచారం.