ఫైనల్ గా మెగాస్టార్ చారిత్రాత్మక చిత్రం సైరా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అందించారు. 

సినిమాకు సంబందించిన షూటింగ్ మొత్తం నేటితో ముగిసిందని అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని అన్నారు. అదే విధంగా షూటింగ్ లో పాల్గొని ఎంతో సహకరించిన యూనిట్ కి ప్రత్యేక కృతజ్ఞతలని ఈ సినిమా షూటింగ్ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా  గ్రాఫిక్స్ పనులు కూడా ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మెగాస్టార్ డబ్బింగ్ పనులను కూడా మొదలెట్టేశారు. కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి టాప్ స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.