కోలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. సీనియర్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్ లో స్టార్ యాక్టర్స్ నటించనున్నారు. విక్రమ్ - కార్తీ - జయం రవి వంటి కోలీవుడ్ స్టార్ హీరోలతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడు. 

అలాగే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ - కీర్తి సురేష్ - అమలాపాల్ వంటి తారలు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోగా ఇప్పుడు మలయాళం సీనియర్ యాక్టర్ జయ రామ్ కూడా సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ రామ్ మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పై వివరణ ఇచ్చారు.

సినిమాలో ప్రతి పాత్ర హైలెట్ గా ఉంటుందని కథలో ఊహించని మలుపులు ఉంటాయని అన్నారు. అదే విధంగా తన పాత్ర కూడా ఒక స్పెషల్ ట్విస్ట్ ఇస్తుందని చెబుతూ.. సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ ఏడాది చివరలో పొన్నియన్ సెల్వన్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.