బాలీవుడ్ కంటే ముందుగానే హై బడ్జెట్ సినిమాలను సౌత్ సినిమా తెరకెక్కిస్తోంది. బాహుబలి - 2పాయింట్ఓ సినిమాల తరువాత మరిన్ని సినిమాలు రావడానికి ఒక దారి ఏర్పడింది. పాన్ ఇండియన్ సినిమా అనేది ఇప్పుడు సరికొత్త ఫార్ములా. అయితే బడా ప్రాజెక్టులను నిర్మించాలని టార్గెట్ గా పెట్టుకున్న లైకా సంస్థ ఇప్పుడు హై బడ్జెట్ సినిమాలంటే భయపడిపోతున్నారు. 

2.O సినిమా కోసం ఎవరు ఊహించని విధంగా 500కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ సంస్థ అనుకున్నంతగా లాభాలను అందుకోలేకపోయింది. అయితే భారతీయుడు 2 సినిమా బడ్జెట్ విషయంలో కూడా వెనుకడుగు వేసిన లైకా సంస్థ మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా విషయంలో కూడా వెనక్కి తగ్గినట్లు టాక్.  

మోహన్‌బాబు, విక్రమ్, ఐశ్వర్యా రాయ్, శింబు, అనుష్క, కార్తీ, కీర్తీ సురేష్‌ వంటి స్టార్ నటీనటులను సెలెక్ట్ చేసుకున్న మణిరత్నం దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో హిస్టారికల్ ఫిల్మ్ ను తెరకెక్కించాలని అనుకున్నాడు. 

అయితే లైకా ముందుగా ఒప్పుకున్నప్పటికీ ప్రస్తుతం రిస్క్ అనే ఆలోచనలో పడినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ మణిరత్నం సినిమాను నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారతీయుడు 2ని కూడా ఇదే సంస్థ టేకాఫ్ చేసినట్లు టాక్.