టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో పోకిరి - బిజినెస్ మెన్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ తీసిన పూరి జగన్నాథ్ మరోసారి మహేష్ తో వర్క్ చేస్తే బావుంటుందని  అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సక్సెస్ లు లేక స్టార్ హీరోలతో పూరి పెద్ద సినిమాలను పట్టాలెక్కించలేకపోతున్నాడు. 

కానీ ఎదో ఒకరోజు మాత్రం మహేష్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తానని ఇటీవల పూరి చెప్పినట్లు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. మహేష్ తో జనగణమన ఎప్పుడు తీస్తారు సార్.. ఆ సినిమాలో మహేష్ ని చూడాలనేది అభిమానుల డ్రీమ్ అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు పూరి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. 

ఆ ప్రాజెక్ట్ కూడా తన డ్రీమ్ అని చెప్పిన పూరి తప్పకుండా త్వరలో రావచ్చని పూరి మరో క్లారిటీ ఇచ్చారు. అంటే రాజమౌళికి మహాభారతం ఎలాగో పూరికి కూడా జనగణమన అనే స్క్రిప్ట్ కూడా కలల ప్రాజెక్ట్ అని అర్ధమవుతోంది. ఇదివరకే మహేష్ కు కథ చెప్పినప్పటికి ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

మహేష్ తో కుదరకపోతే వేరే హీరోతో అయినా జనగణమన తీస్తానని గతంలో  చెప్పిన పూరి ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం మహేష్ తోనే చేస్తానని చెప్పాడు. మరి మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.