టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా గురువారం గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే మహర్షి సినిమా పలు చోట్ల నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. 

గుంటూరు ఏరియాలో ఎవరు ఊహించని విధంగా మొదటి రోజు 4.40 కోట్ల షేర్స్ ను రాబట్టి రెండవ స్థానంలో నిలిచింది. బాహుబలి 2 తరువాత ఇంతకుముందు వినయ విధేయ రామ (4.18కోట్లు) -  అరవింద సమేత (4.16కోట్లు) సినిమాలు  నిలువగా మహర్షి గుంటూరు రికార్డ్ ను బ్రేక్ చేశాడు.  ఇక నైజం ఏరియాలో కూడా సినిమా 6 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు టాక్.  

మరికొద్ది సేపట్లో ఈ కలెక్షన్స్ పై ఫుల్ క్లారిటీ రానుంది. ఇక కృష్ణ జిల్లాలో మహేష్ మరోసారి తన సత్తా చాటాడు. భరత్ అనే నేను ఆ ఏరియాలో 1.31 కోట్ల షేర్స్ ని అందించగా మహర్షి  1.39కోట్ల షేర్స్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ లో ఆనందాన్ని నింపింది.