ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న నటీమణి కంగనా రనౌత్. స్టార్ హీరోల రేంఙ్ లో 100కోట్ల బిజినెస్ తో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ కోసం స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 

అయితే సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ సాంగ్ కోసం అమ్మడు ఎప్పుడు లేని విధంగా క్లాసికల్ డ్యాన్స్ పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేలా దాదాపు 100 మంది నృత్య కళాకారులతో భరతనాట్యంకి సంబందించిన సాంగ్ ని కంపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ సాంగ్ కోసం గత కొన్ని రోజులుగా కంగనా భరతనాట్యం క్లాసులకు వెళ్లి డ్యాన్స్ నేర్చుకుంటోంది. 

జయలలిత పాత సినిమాలకు సంబందించిన డ్యాన్సులపై అలాగే నటనపై చిత్ర యూనిట్ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. అందులో కూడా కంగనా గ్యాప్ లేకుండా పాల్గొంటూ ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు తమిళ్ హిందీ భాషల్లో దర్శకుడు ఏఎల్.విజయ్ తెరకెక్కించనున్నాడు. బాహుబలి రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమకు రచయితగా వర్క్ చేస్తున్నారు.