బిగ్ బాస్ సీజన్ 3 ఐదో వారం పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే ఈ వారం ఇంటి నుండి వెళ్లేది ఎవరనే విషయంలో ఇప్పటికే లీకులు వచ్చాయి. పునర్నవి, శివజ్యోతి, హిమజ, అషు రెడ్డి, రాహుల్, బాబా భాస్కర్, మహేష్ విట్ట ఎలిమినేషన్ రౌండ్ లో ఉండగా.. మహేష్, 
శివజ్యోతి సేఫ్ అయినట్లు నాగార్జున చెప్పారు.

ఇక మిగిలిన వారితో ఈ వారం అషు రెడ్డి బయటకి రాబోతుందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. జూనియర్ సమంతగా పేరుతెచ్చుకున్న అషురెడ్డి ఈవారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వడం దాదాపు ఫిక్స్ అయినట్లే.. ఎలిమినేషన్ విషయాలు ముందే బయటకి వచ్చేస్తుండడంతో షోపై ఆసక్తి తగ్గిపోతుంది.

షోను నాగార్జున ఎంత రక్తి కట్టించాలని చూసినా, ఎంత ఉత్కంఠ పెంచాలని ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడంలేదు. ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలోనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ట్రాన్స్ జెండర్ తమన్నాని పంపించి బిగ్ బాస్ టీమ్ ఎంత పెద్ద తప్పు చేసిందో తెలిసిందే. 

అలాంటి తప్పులు రిపీట్ కాకుండా ఓ హీరోయిన్ ను హౌస్ లోకి పంపడానికి ప్లాన్ చేస్తున్నారు. మొన్నటివరకు ఈ లిస్ట్ లో హేబ్బా పటేల్, శ్రద్ధాదాస్ వంటి తారల పేర్లు వినిపించాయి. తాజాగా ఈషా రెబ్బ పేరు వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈషా రెబ్బ ఈ వారం హౌస్ లోకి వెళ్లనుంది. మరేం జరుగుతుందో చూడాలి!