ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మేటి నటుల్లో ఒకరైన కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నప్పుడే అడుగులతో యాక్టింగ్ ను అలవాటుగా చేసుకొని, మాటలు నేర్చుకుంటూనే డైలాగులు చెప్పడం మొదలుపెట్టిన నటుడి గురించి ఏం చెప్పగలం. ఇక ఫిట్ నెస్ లో కూడా ఎన్నో ప్రయోగాలు చేసి సినిమా సినిమాకు నటుడిగా కమల్ చూపించినా విశ్వరూపాలు అన్ని ఇన్ని కావు. 

ఇకపోతే 63ఏళ్ల లోకనాయకుడు భారతీయుడు 2 కోసం చెమటలు చిందిస్తున్నాడట. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 20 ఏళ్ల తరువాత ఆ బాక్స్ ఆఫీస్ కథకు సీక్వెల్ వస్తోంది అనగానే అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. 

అయితే ఎంత కష్టమైనా మరోసారి భారతీయుడు 2లో చేసే పాత్ర మరొక ట్రెండ్ సెట్ చేయాలనీ కమల్ ఆలోచిస్తున్నాడు. వీలైనంత వరకు బరువు తగ్గాలని శంకర్ ఇచ్చిన సలహామేరకు కమల్ నిపుణుల సమక్షంలో ఫిట్నెస్ లో మార్పులు చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం శబాష్ నాయుడు షూటింగ్ లో గాయపడగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. 

ఇక రాజకీయ పరిణామాల కారణంగా కమల్ కొంచెం లావెక్కరు. ఇప్పుడు ఆ బరువు తగ్గడానికి జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. మరి ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. డిసెంబర్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.