సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహర్షి సూపర్ సక్సెస్ అందించిన ఉత్సాహంతో మహేష్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. 

మహేష్ సినిమా అంటే రెమ్యునరేషన్, బడ్జెట్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. మహర్షి చిత్రానికి కూడా బడ్జెట్ ఎక్కువైందనే టాక్ వినిపించింది. కానీ సమ్మర్ సీజన్ కావడంతో ఆ చిత్రం గట్టెక్కేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో వినిపిస్తున్న బడ్జెట్ లెక్కలు షాకిచ్చే విధంగా ఉన్నాయి. 

నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటాతో కలిపి మహేష్ రెమ్యునరేషన్ 50 కోట్లు దాటుతున్నట్లు సమాచారం. మిగిలిన మొత్తం సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 90 కోట్లకు పైమాటే నట. దీనితో దిల్ రాజులో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇందులో అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ 9 కోట్లు, చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి రెమ్యునరేషన్ 3 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

అనిల్ రావిపూడి సింపుల్ గా సినిమాని పూర్తి చేస్తాడనుకుంటే.. మహర్షికి మించేలా ఈ చిత్ర బడ్జెట్ ఉందబోతోందట. సినిమా బిజినెస్ లో ఆరితేరిన దిల్ రాజు సరిలేరు నీకెవ్వరు ఖర్చులు ఎలా తగ్గిస్తారో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.