నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. ఈ చిత్రంలోని నాని లేటెస్ట్ లుక్ ఆసక్తి రేపింది. అదే సమయంలో ట్వీట్లో నాని చేసిన కామెంట్ ఉత్కంఠ రేపుతోంది. అసలు ఈ మూవీలో హీరో శనివారం ఏమి చేస్తాడు? 

వరుస విజయాలతో జోరు మీదున్నాడు నాని. ఆయన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్న సూపర్ హిట్. ఈసారి ఆయన మరో వినూత్న ప్రయోగానికి తెరలేపాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే చిత్రం చేస్తున్నారు. టైటిల్ తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేశారు. చాలా వెరైటీగా ఉంది టైటిల్. అదే సమయంలో నాని లుక్ వైలెంట్ గా ఉంది. సరిపోదా శనివారం పోస్టర్స్ లో నాని అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు. 

లేటెస్ట్ లుక్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. పాత కాలపు బైక్ పై నాని స్మైలీ ఫేస్ తో రైడ్ చేస్తున్నాడు. అతడి గెటప్ చూస్తే మిడిల్ క్లాస్ ప్రైవేట్ ఎంప్లొయ్ రోల్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సదరు లుక్ షేర్ చేసిన నాని... 'సండే టు ఫ్రైడే వైలెన్స్ కి ఇన్సూరెన్స్. సూర్య' అని కామెంట్ జోడించాడు. సరిపోదా శనివారం చిత్రంలో నాని క్యారెక్టర్ నేమ్ సూర్య అని స్పష్టం అవుతుంది. 

అలాగే సండే టు ఫ్రైడే వైలెన్స్ కి ఇన్సూరెన్స్... అంటే అర్థం ఏమిటనేది తెలియాలి. ఒకవేళ వారంలో ఆరు రోజులు జాబ్ చేసుకునే హీరో... శనివారం మాత్రం శత్రువుల భరతం పడతాడేమో. గతంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ మాస్, యాక్షన్ జోనర్ టచ్ చేయలేదు. ఆయన రొమాంటిక్ కామెడీ, ఎమోషనల్ చిత్రాలు మాత్రమే చేశారు. వివేక్ ఆత్రేయ టచ్ చేయని జోనర్ సరిపోదా శనివారం. 

ఇక నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ డిజాస్టర్ అయ్యింది. వివేక్ ఆత్రేయ మీద నమ్మకంతో నాని మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి నానికి వివేక్ ఆత్రేయ ఎలాంటి ఫలితం ఇస్తాడో చూడాలి. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కుమార్, ఎస్ జె సూర్య, అదితి బాలన్ ఇతర కీలక రోల్స్ లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

Scroll to load tweet…