తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన బాహుబలి చిత్రంలో లతా మంగేష్కర్ ఓ పాట పాడాల్సింది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు.

ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత నెల మొదటి వారం నుంచి హాస్పిటల్ లోనే ఉన్న లతాజీ.. మరోసారి విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. కరోనాతో గత నెల 8న ముంబై లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన లతా(Lata Mangeshkar)జీ.. అప్పటి నుంచి ఐసీయూలోనే ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు. 

ఈ మధ్య ఆమె ఆరోగ్యం కుదుటపడ్డట్టు డాక్టర్లు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. కాగా కొద్దిసేపటి క్రితమే ఆమె మరణించినట్లు బీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. లతా మంగేష్కర్ మృతితో దేశవ్యాప్తంగా అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా ప్రముఖులంతా లతా మంగేష్కర్ మృతి సంతాపం తెలియజేస్తున్నారు.

లతా మంగేష్కర్ పాడిన అద్భుతమైన పాటలు, భారత రత్నగా ఆమె ఎదిగిన విధానాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఆమె తెలుగులో పాడింది మాత్రం కేవలం మూడు పాటలే. ఏఎన్నార్ నటించిన సంతానం చిత్రంలో నిదురపో తమ్ముడా సాంగ్ లతా మంగేష్కర్ తెలుగులో పాడిన మొదటి పాట. 

ఇదిలా ఉండగా తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన బాహుబలి చిత్రంలో లతా మంగేష్కర్ ఓ పాట పాడాల్సింది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. బాహుబలి 2 మూవీలో అనుష్క అందంగా డాన్స్ చేసే 'కన్నా నిదురించారా' సాంగ్ సూపర్ హిట్. ఆ పాట హిందీ వర్షన్ ని లతా మంగేష్కర్ తో పాడించాలని సంగీత దర్శకుడు కీరవాణి అనుకున్నారట. ఆమెని సంప్రదించడం కూడా జరిగింది. 

ఇది చాలా మంచి సాంగ్ అని లతా మంగేష్కర్ ప్రశంసించారట. తనకు పాడాలనే ఉన్నపటికీ వయసు రీత్యా పాడలేనని చెప్పారట. దీనితో కీరవాణి ఆ పాటని మధుశ్రీ తో పాడించారు. అలా బాహుబలి చిత్రాన్ని లతా మంగేష్కర్ మిస్సయ్యారు.