లతా మంగేష్కర్ 26 వేలకు పైగా పాటలు పాడారు. అన్ని పాటలకు ఆమె అద్భుతమైన గాత్రాన్ని అందించారు. లతా మంగేష్కర్ కెరీర్ టాప్ టెన్ ది బెస్ట్ సాంగ్స్ ఇప్పుడు చూద్దాం.  

ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. గత నెల మొదటి వారం నుంచి హాస్పిటల్ లోనే ఉన్న లతాజీ.. మరోసారి విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. కరోనాతో గత నెల 8న ముంబై లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన లతా(Lata Mangeshkar)జీ.. అప్పటి నుంచి ఐసీయూలోనే ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు.

ఈ మధ్య ఆమె ఆరోగ్యం కుదుటపడ్డట్టు డాక్టర్లు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. కాగా కొద్దిసేపటి క్రితమే ఆమె మరణించినట్లు బీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. లతా మంగేష్కర్ మృతితో దేశవ్యాప్తంగా అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మధుర గాత్రాన్ని, అద్భుతమైన పాటలని గుర్తు చేసుకుంటున్నారు. లతా మంగేష్కర్ 26 వేలకు పైగా పాటలు పాడారు. అన్ని పాటలకు ఆమె అద్భుతమైన గాత్రాన్ని అందించారు. లతా మంగేష్కర్ కెరీర్ టాప్ టెన్ ది బెస్ట్ సాంగ్స్ ఇప్పుడు చూద్దాం.

ఈ పాట వినగానే ఈ సినిమాలోనిదో యిట్టె చెప్పేయొచ్చు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కెరీర్ లో క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయే 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' చిత్రంలోనిది. ఈ సాంగ్ ఎప్పటికి ఎవర్ గ్రీన్. 90వ దశకంలో ఈ పాట యువతని ఉర్రూతలూగించింది. కుమార్ సాను తో కలసి లతా మంగేష్కర్ ఈ పాటని అద్భుతంగా పాడారు.

ఈ పాట 1967లో దేవ్ ఆనంద్ నటించిన 'జ్యూవెల్ థీఫ్' చిత్రంలోనిది. ఈ వింటేజ్ సాంగ్ సంగీత ప్రియులని విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటలో లతా మంగేష్కర్ గాత్రంలో మాధుర్యాన్ని గమనించవచ్చు.

YouTube video player

'ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై' ఈ సాంగ్ కూడా దేవ్ ఆనంద్ నటించిన సినిమాలోనిదే. దేవ్ ఆనంద్, వహీదా రెహ్మాన్ జంటగా నటించిన గైడ్ చిత్రంలోనిది ఈ పాట. ఈ రొమాంటిక్ సాంగ్ ని లతా మంగేష్కర్ తనదైన శైలిలో పాడి మెప్పించారు.

ఈ సాంగ్ కూడా గైడ్ చిత్రలోనిదే. స్లో పాయిజన్ లాగా ఈ పాట ఎక్కేస్తుంది. లతా మంగేష్కర్ తన వాయిస్ తో ప్రేక్షకులని మైకంలో ముంచెత్తిన పాట ఇది.

దిగ్గజ నటుడు రాజేష్ ఖన్నా, షర్మిల ఠాగూర్ జంటగా నటించిన ఆరాధన చిత్రంలోనిది. ఈ రొమాంటిక్ సాంగ్ వింటేజ్ సాంగ్స్ ఇష్టపడే వారికీ ఫేవరిట్ సాంగ్ గా ఉంటుంది.

YouTube video player

సునీల్ దత్, సాధన జంటగా నటించిన 'మేరా సాయ' మూవీలో 'మేరా సాత్ హోగా' పాట బ్రీజీగా సాగుతూ వినసొంపుగా ఉంటుంది.

ఈ క్లాసిక్ రొమాంటిక్ సాంగ్ కి లతా మంగేష్కర్ తన అద్భుతమైన గాత్రాన్ని అందించారు. సంగీత ప్రియులని సరికొత్త లోకంలోకి తీసుకువెళ్లినట్లుండే ఈ పాట ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటి. లెజెండ్రీ నటుడు ధర్మేంద్ర నటించిన 'అన్పాద్' చిత్రంలోని ఈ సాంగ్.

YouTube video player

షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా నటించిన దిల్ సే చిత్రంలోని ఈ పాట యువతకు బాగా నచ్చిన సాంగ్స్ లో ఒకటి. లతా మంగేష్కర్ తన అద్భుత గాత్రంతో మెస్మరైజ్ చేస్తూ ఈ పాట పాడారు.

దిల్ అపన ఔర్ ప్రీత్ పారి చిత్రంలోని ఈ సాంగ్. ఈ పాట కూడా అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది.

YouTube video player

2001లో విడుదలైన కభీ ఖుషీ కభీ ఘమ్ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని లతా మంగేష్కర్ అద్భుతంగా పాడారు. ఈ చిత్రంలో షారుఖ్, హృతిక్ కలసి నటించిన సంగతి తెలిసిందే.