లాస్య మరోసారి ఇంటి సభ్యులచేత కన్నీళ్ళు పెట్టించింది. కలచివేసిన సంఘటన చెప్పి ఎమోషనల్‌ అయ్యింది. అంతేకాదు పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది.  బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన ఎపిసోడ్‌లో `పల్లెకు పోదాం ఛలో ఛలో..` కెప్టెన్సీ పోటీ దారు టాస్క్ ముగిసిన తర్వాత బిగ్‌బాస్‌ ఒప్పోకి సంబంధించి సమాజం కోసం, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను చెప్పాలన్నారు. ఎవరు చెప్పిన సంఘటన కదిలిస్తుందో వారిని బెస్ట్ గా ఎంపిక చేసి ఒప్పో ఫోన్‌ గిఫ్ట్ గా ఇస్తారు. 

అందులో భాగంగా లాస్య మాట్లాడుతూ, తాను 2010లోనే మ్యారేజ్‌ చేసుకున్నట్టు తెలిపింది. అయితే ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడిందట. 2012లో కలిసి ఉన్నామని, 2014 జనవరిలో వారి నాన్న నుంచి ఫోన్‌ వచ్చిందట. `మీరు మ్యారేజ్‌ చేసుకున్నారనే విషయం ఎవరికి తెలియదు. ముందు జీవితంలో సెటిల్‌ అవ్వండి. ఆ తర్వాత తామే స్వయంగా పెళ్ళి చేస్తాం` అని చెప్పారు. అప్పుడు లాస్య చాలా సంతోషించిందట. 

కానీ అదే వారం ఆమెకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళితే గర్బవతి అని చెప్పారట. కానీ ఫ్యామిలీకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉందట. దీంతో ఇంట్లో చెప్పకుండానే అబార్షన్‌ చేయించుకుందట. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. 2017లో మళ్ళీ పెద్దల సమక్షంలో మ్యారేజ్‌ చేసుకున్నామని, ఐదు నెలలకే మళ్ళీ గర్బవతిని అయ్యానని, కానీ అది మిస్‌ క్యారీ అయిందని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. 2018లో తన పొట్టలోకి జున్ను వచ్చాడు. ఆ తర్వాత తన జీవితమే మారిపోయిందని చెప్పింది. కానీ తన ఫస్ట్ బేబీని చంపుకున్నాననే బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంద`ని ఎమోషనల్‌ అయ్యింది. అందరిని ఎమోషనల్‌కి గురి చేసింది. 

అందరిలో కెల్లా లాస్య చెప్పిన సంఘటన అందరిని కదిలించింది. దీంతో ఆమె బెస్ట్ గా నిలిచి దివాళి ఎడిషన్‌ ఒప్పో ఫోన్‌ని గెలుచుకుంది. ఇక ఫ్రెండ్‌ కోసం సోహైల్‌ చేసిన సాయం ఘటన కూడా ఆకట్టుకుంది.