Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో తులసి, దివ్యతో మనసు ప్రశాంతంగా లేకపోతే మన కంటికి ఎదురుగా ఉన్న వస్తువులు కూడా మన కంటికి కనపడవు అని అంటుంది. అప్పుడు దివ్య అయినా మన పిచ్చి గానీ మన గురించే మనకు సరిగా తెలియదు తెలియని వాళ్ళ గురించి జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటో నా తెలివి తక్కువ తనం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి మొబైల్ లో మనం తప్పు చేశామన్నప్పుడు చెంపలు వాయించుకోవడం మంచిది అనగా దివ్య పొలమారుతుంది. అప్పుడు దివ్యని చూసి తులసి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు నందు తులసితో మాట్లాడడానికి ఒక దొంగలాగా అటు ఇటు చూస్తూ కిచెన్ వైపు వెళ్తాడు.

అప్పుడు దొంగ చాటుగా కిచెన్ లోకి చూస్తుండగా ఇందులో పరందామయ్య అక్కడికి వచ్చి ఈ వయసులో వీనికి ఇదేం పాడు బుద్ధి చెప్తా నీ సంగతి అని నందు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఒరేయ్ ఏం చూస్తున్నావ్ రా అనడంతో తులసి మూడు ఎలా ఉందో చూస్తున్నాను అని నందు వెనక్కి తిరిగి చూడగా పరంధామయ్య ఉండడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. అయ్యో నాన్న మీరు అనుకుంటున్నా దృష్టితో నేను చూడలేదు నాకేం పాపం తెలియదు అని లెంప లేసుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు.

ఆ తర్వాత బసవయ్య రాజ్యలక్ష్మి తో మాట్లాడుతూ ఒకసారి విక్రమ్ పెళ్లి సంబంధం గురించి బావగారికి అలాగే మామయ్యకి ఒకసారి చెబితే బాగుండు కదా వాళ్ళు సంతోషపడతారు అనగా సంతోష పడకపోయినా పర్లేదు కానీ కాళ్లకు అడ్డుపడకుండా ఉంటే చాలు అని అంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడు విక్రమ్ అటుగా వెళుతూ రాజ్యలక్ష్మి వాళ్ళని పట్టించుకోకుండా వెళ్తుండడంతో ఏమైంది నాన్న అనగా నిద్ర వస్తుంది అని అబద్ధం చెబుతాడు విక్రమ్. నువ్వు భోజనం చేయకపోతే నేను కూడా కంచం ముందు నుండి లేస్తాను అని రాజ్యలక్ష్మి పైకి లేవడంతో అమ్మ వద్దులే అమ్మ నువ్వు కూర్చొనేను భోజనం చేస్తాను అని అంటాడు విక్రమ్.

విక్రం భోజనానికి కూర్చోగా భోజనం వడ్డించినా కూడా తినకుండా ఏదో దివ్య అన్న మాటల గురించి పదేపదే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక పనిమనిషి మీద అరుస్తాడు విక్రమ్. అప్పుడు రాజ్యలక్ష్మి భోజనం చేయకుండా చేతులు కడిగేసుకుని విక్రమ్ తో పాటు కింద కూర్చుంటుంది. అప్పుడు విక్రమ్ మీద దొంగ ప్రేమలు చూపిస్తూ భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఏమైంది నాన్న నీ ముఖంలో ఏదో దిగులు బాధ కనిపిస్తోంది అని అంటుంది రాజ్యలక్ష్మి. చెప్పాను కదా అమ్మ నిద్ర వస్తుందని అనడంతో అంతే కదా అనడంతో అంతే అని అంటాడు విక్రమ్. అప్పుడు రాజ్యలక్ష్మి సంతోషంతో మాట్లాడుతూ రేపు నీకు పెళ్లిచూపులు అనడంతో విక్రం షాక్ అవుతాడు.

 అప్పుడు విక్రమ్ అలాగే అమ్మ నువ్వు ఎలా చెప్తే అలా అని అంటాడు. ఆ తర్వాత లాస్య పడుకుని ఉండగా నందు దొంగచాటుగా వెళ్లి తులసి తో మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు దొంగ చాటుగా ఎవరు చూడకుండా తులసి గదికి వెళ్తాడు. అప్పుడు వెంటనే అనసూయ నిద్ర లో ఒరేయ్ ఆగరా ఎవరూ చూడరులే అనుకుంటున్నావా అనడంతో అడ్డంగా దొరికిపోయానే అనుకుంటూ ఉంటాడు నందు. అప్పుడు పరంధామయ్య అబ్బబ్బ దీన్ని సీనియర్ డైలాగులతో చచ్చిపోతున్నాను ఒసేయ్ పడుకోవే అనడంతో అనసూయ మౌనంగా పడుకుంటుంది. ఆ తర్వాత అమ్మయ్య నిద్రపోయారు అనుకుని నందు అక్కడినుంచి వెళ్లాలి అనుకుంటుండగా ఇంతలో లాస్య అక్కడికి రావడంతో అది చూసి నందు షాక్ అవుతాడు.

 అప్పుడు లాస్య తన గదిలోకి వెళ్లి ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగోతం అర్ధరాత్రి పక్కన పెళ్ళాన్ని పెట్టుకొని మాజీ భార్య గదిలోకి వెళ్లడాన్ని ఏమంటారు అని అంటుంది. అప్పుడు నందు నువ్వు ఏవేవో ఊహించుకోకు అనడంతో అందరూ నిద్రపోయిన తర్వాత తులసి గదిలోకి ఎందుకు వెళ్లావు అని అంటుంది. మనసులో చెడు ఉద్దేశంతో లేనప్పుడు ఎందుకు వెళ్లావు అనడంతో తెల్లారితో నా దరిద్రం ఇంటి ముందుకు వచ్చి వాలుతుంది అప్పుడు ఏం చేయాలో తెలియక వెళ్లాను అని అంటాడు నందు. అప్పుడు నందు వాసుదేవ్ అని తన ఫ్రెండ్ గురించి మొత్తం చెప్పడంతో సంతోషపడుతూ ఉంటుంది. నేను తులసి భార్యాభర్తలు అని వాడు అనుకుంటున్నాడు అనడంతో దాంట్లో టెన్షన్ పడడానికి ఏముంది నందు ఫ్లైట్ తిరగాలని జరిగింది మొత్తం చెప్పు అని అంటుంది లాస్య.

 నాకంటే తులసికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు డివర్స్ విషయం తెలిస్తే నా ముఖం కూడా చూడడు అని అంటాడు నందు. అప్పుడు లాస్య అదిరిపోయే ప్లాన్ చెబుతాను విను మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు తెలిసి భార్యాభర్తలుగా నటించండి అనడంతో నందు ఆశ్చర్యపోతాడు. జస్ట్ భార్యాభర్తలు గా మాత్రమే నటించాలి అని అంటుంది లాస్య. ముందుగానే ప్రిపేర్ అయ్యావా అనడంతో లేదు అనగా నాకు ఇష్టం లేదు కానీ చచ్చినట్టు నటించాల్సి ఉంది ఈ విషయం గురించి పొద్దున్నే తులసితో మాట్లాడదాము అని అంటుంది లాస్య. ఈ విషయంలో తులసి ఒప్పుకుంటుందా అనగా కేఫ్ విషయంలో ఒప్పుకుంది కదా అలాగే ఈ విషయంలో కూడా ఒప్పుకుంటుందిలే అని అంటుంది లాస్య. నీకు అనుమానం ఉంటే ముందు వెళ్లి మీ నాన్న అమ్మని ఒప్పించు వాళ్లే తులసిని ఒప్పిస్తారు అని అంటుంది.

మరొకవైపు విక్రమ్ వాళ్ళ తాతయ్య కాళ్లు నొక్కుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వాళ్ళ తాతయ్య పెళ్లి ప్రస్తావన తీసుకువస్తాడు. అప్పుడు దేవుడు ఇదిగో బాబు గారు అమ్మ పెళ్లి చూపుల కోసం బట్టలు పంపించింది అనడంతో విక్రం వాళ్ళ తాతయ్య బాధపడుతూ ఒరేయ్ దేవుడు నువ్వు ఈ వంశానికి కోట్ల ఆస్తికి వారసుడివి నీకు పనిమనిషిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది గతి ఏముంది అని అంటాడు. పెళ్లి విషయంలో ఎందుకురా ఇంత తొందర పడుతున్నావు అనగానే నేను తొందరపడటం లేదు తాతయ్య అమ్మనే పెళ్లి చూపులు చూసింది అని అంటాడు విక్రమ్. అప్పుడు విక్రమ్ రాజ్యలక్ష్మి మాటలను గుడ్డిగా నమ్ముతూ ఉంటాడు.

విక్రమ్ వాళ్ళ తాతయ్య ఎంత మంచి చెప్పినా కూడా వినిపించుకోకుండా ఉండడంతో విక్రమ్ వాళ్ళ తాతయ్య వీరికి చెప్పికూడా అనవసరంగా వేస్ట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీ మనసులో ఆ డాక్టర్ అమ్మ ఉంది కదా అదృష్టం చేయకపోతే ఎవరు దక్కరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. మరొకవైపు అనసూయ వేలు కదిలిస్తూ ఎక్సర్సైజ్ చేస్తుండగా ఎక్సర్సైజ్ చేయడం అంటే ఇలా కాదే నడుముంచి కొంచెం బాడీ ఒంచాలి అనడంతో అది కాదండి తులసి నాకోసం ఇష్టమైన కూరని చేస్తోంది ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే నాలుగు ముద్దలు ఎక్కువ తినవచ్చు అని అంటుంది అనసూయ.