లాస్య షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తుంది. తాను చేసుకున్న భర్త మంజునాథ్‌ గురించి సీక్రెట్స్ వెల్లడిస్తూ వారి ఫ్యామిలీకి షాక్‌ ఇస్తుంది. గతంలో తాను అబార్షన్‌ చేసుకున్నానని తెలిపి ఇంట్లో వారి గుండెల్లో రాయి పడ్డంత పనిచేసింది. ఇప్పుడు మరో దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. గురువారం ఎపిసోడ్‌లో మరో సీక్రెట్‌ రివీల్‌ చేసింది. బిగ్‌బాస్‌ టాస్క్ మేరకు, తమకి వచ్చిన సందేశాలను తీసుకోవడానికి ముందు ఎవరికి చెప్పని సీక్రెట్స్ చెప్పాలని సభ్యులకు కండీషన్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. 

అందరు తమ సీక్రెట్స్ వెల్లడించారు. లాస్య తన భర్త గురించి మరో షాక్‌ ఇచ్చింది 2012లో లాస్య, మంజునాథ్‌ ప్రేమ పెళ్లి చేసుకుంటే, 2017లో పెద్దలు కుదిర్చిన మ్యారేజ్‌ చేసున్నామని తెలిపింది. `పెళ్లైనప్పుడు నేను ఒక మరాఠీ కుర్రాడిని పెళ్ళి చేసుకున్నానని చెప్పాను. అయితే అతను చాలా కోటీశ్వరుడు, డబ్బున్న అబ్బాయి అనుకున్నారు. కానీ తను మిడిల్‌ క్లాస్‌ కూడా కాదు. అతని ఆర్థిక పరిస్థితి ఏంటనేది నాకు మాత్రమే తెలుసు` అని చెప్పింది. 

ఇంకా చెబుతూ, మరో పెద్ద షాక్‌ ఇచ్చింది. `తను నాకంటే ఒక ఏడాది చిన్న. ఆ విషయం తెలిసాక నేను కూడా చాలా బాధపడ్డాను. నేను నాకంటే ఏడాది చిన్న వాడిని లవ్‌ చేశానా? అని ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. ఈ సీక్రెట్‌ ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. ఈ షోకి వచ్చాక షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నా.. అమ్మా మీ అల్లుడు నా కంటే ఏడాది చిన్న.. కానీ ఆయనది చాలా పెద్ద మనసు. బాగా చూసుకుంటాడు` అని తెలిపి కన్నీళ్లు పెట్టించింది.