పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. అయ్యప్పన్ కోషియం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు సాగర్ చంద్ర మాస్ వే లో ప్రజెంట్ చేయబోతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం Bheemla Nayak. అయ్యప్పన్ కోషియం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు సాగర్ చంద్ర మాస్ వే లో ప్రజెంట్ చేయబోతున్నాడు. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర పాటల సందడి ఆల్రెడీ షురూ అయింది. 

Pawan Kalyan అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న LaLa Bheemla సాంగ్ కొద్దిసేపటి క్రితమే విడుదలయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ పాటని విడుదల చేశారు. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా తమన్ లాలా భీమ్లా రూపంలో మరో మాస్ బీట్ ఇచ్చాడు. లిరికల్ వీడియో చూస్తుంటే పవన్ అభిమానులకు పూనకాలు గ్యారెంటీ అనిపిస్తోంది. ఈ పాటకు త్రివిక్రమ్ శ్రీనివాస్ లిరిక్స్ అందించడం విశేషం. 

Also Read: Jai Bhim controversy: చెంప పగలగొట్టే సీన్ పై ప్రకాష్ రాజ్ రియాక్షన్, అదిరిపోయే కౌంటర్

ఈ లిరికల్ వీడియోని సరికొత్తగా ప్రజెంట్ చేశారు. తమన్ డ్రమ్స్ వాయిస్తుండగా.. మంచి జోష్ తో సింగర్ అరుణ్ కౌండిన్య ఈ పాటకు గాత్రం అందించారు. లేడి డాన్సర్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ డాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది. సాంగ్ రెండున్నర నిమిషం మాత్రమే ఉన్నా మాస్ కు బాగా చేరువయ్యేలా ఉంది. 

'పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సాంగ్ మొత్తం ఒకే టెంపోలో హై ఎనర్జీతో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, అంత ఇష్టమేందయ్యో సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ థర్డ్ సింగిల్ కూడా చాలా బావుంది. 

సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి Trivikram Srinivas మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. వెండి తెరపై పవన్, రానా మధ్య వార్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

పవన్ కళ్యాణ్ లుంగీ గెటప్ ఆసక్తిగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా పవన్ ఈ చిత్రంలో మాస్ అవతారంలో దర్శనం ఇస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లిరికల్ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి. 

YouTube video player