లక్ష్మీస్ వీరగ్రంథంలో లక్ష్మీరాయ్ ఎంపిక... అందుకేనా?

lakshmis veeragrandham heroine is lakshmi raai and why
Highlights

  • కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకనిర్మాణంలో లక్ష్మీస్ వీరగ్రంథం మూవీ
  • ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల పై తెరకెక్కనున్న ఈ సినిమాపై అంతటా ఆసక్తి
  • లక్ష్మీపార్వతి పాత్రలో రాయ్ లక్ష్మీ ఎంకిక గ్లామర్ చూపించేందుకేనని విమర్శలు
  • తన పాత్రను అసభ్యంగా, అసత్యంగా చిత్రీకరిస్తే అడ్డుకుంటానన్న లక్ష్మీపార్వతి

 

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలన్నీ కాస్త అటు ఇటుగా ఒకేసారి రూపొందబోతున్నాయి. ఈ సినిమాలు వచ్చే ఏడాది బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాల్లో లక్ష్మీస్‌ వీరగ్రంథం సినిమా మొదటగా ప్రారంభమైంది. లక్ష్మీపార్వతిని టార్గెట్‌ చేసి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఇటీవల ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా ప్రారంభించారు.

 

ఈ మూవీలో లక్ష్మీపార్వతిని మాత్రం ఎలా చూపించాలనుకుంటున్నారో పోస్టర్ లో వేసిన హార్మోనియం పెట్టె అవన్నీ అద్దం పడుతున్నాయి. దీనిపై లక్ష్మీపార్వతి కూడా హెచ్చరికలు జారీ చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సినిమా తీస్తే రిలీజ్ కానిచ్చే ప్రసక్తే లేదని, సుప్రీంకోర్టు వరకు వెళ్లి అయినా పోరాటం చేస్తానని లక్ష్మీపార్వతి స్పష్టం చేస్తున్నారు.

 

లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రకు రాయ్‌ లక్ష్మిని ఎంపిక చేశారని తెలుస్తోంది. రాయ్ లక్ష్మి ఎంపికపై ప్రస్తుతం సినీ,రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిని చాలా ఘాటుగా, హాటుగా చూపించాలని దర్శకుడు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే రాయ్‌ లక్ష్మీని ఎంపిక చేసుకున్నాడు. మరి గ్లామర్ పాత్రలకు, ఐటమ్ నంబర్స్ కు పెట్టింది పేరైన రాయ్‌ లక్ష్మీ ఏ స్థాయిలో లక్ష్మీ ప్వాతిగా అలరిస్తుందనేది చూడాలి.

 

అది గాక ఆమెకున్న హాట్ ఇమేజ్ కు ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడంపై అసలు దర్శక నిర్మాతలు ఈ సినిమాను ఏ కోణంలో తీస్తున్నారో అర్ధమవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో జూలీ-2గా అందాలు ఆరబోసిన రాయ్ లక్ష్మి.. ఈ లక్ష్మీస్ వీరగ్రంథంలో ఎలాంటి తీరన్న పాత్రలో నటిస్తుందో చూడాలి.

loader