వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఇటీవల కాలంలో వర్మ ఎక్కువగా ప్రముఖుల జీవిత చరిత్రలపై ఫోకస్ పెట్టాడు. రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా వర్మ ఎక్కువగా సినిమాలు చేస్తుండడంతో మీడియాలో అటెన్షన్ ఎక్కువైంది. వర్మ సినిమాలకు ప్రచారం బాగా జరుగుతోంది. నిన్న మొన్నటివరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో ఆర్జీవీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 

ఆ మధ్యన కేసీఆర్ బయోపిక్ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించడమే కాదు.. టైగర్ కేసీఆర్ అనే టైటిల్ కూడా విడుదల చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి తాజాగా కేసీఆర్ బయోపిక్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వర్మ దర్శకత్వంలో తాను కేసీఆర్, జయలలిత బయోపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

ఈ రెండు చిత్రాలు త్వరలోనే సిద్దమవుతాయని అన్నారు. వర్మ ఎప్పుడు ఏ ప్రకటన చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. ఆ మధ్యన శశికళ బయోపిక్ చిత్రాన్ని ప్రకటించాడు. అది కాస్త అటకెక్కింది. ఇప్పటికే జయలలిత బయోపిక్ పై తమిళంలో తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో వర్మ కేసీఆర్, జయలలిత బయోపిక్ చిత్రాలని ఎప్పటికి పూర్తి చేస్తాడో వేచి చూడాలి.