విలక్షణ దర్శకుడు అని తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న వర్మ ఇప్పుడు మాత్రం వయసు పెరుగుతున్న కొద్దీ సత్తా తరిగిపోతోంది అనే కామెంట్స్ అందుకుంటున్నాడు . మాటలతో సమాధానాలు గట్టిగానే చెప్పినా కూడా సినిమా విషయానికి వచ్చేసరికి తేలిపోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. వర్మ హిట్టు కొట్టి చాలా కాలమవుతోంది. 

సాధారణంగా వర్మ సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా జనాలను ఆకట్టుకుంటాయి. అయితే కిల్లింగ్ వీరప్పన్ తరువాత వర్మ మరో సినిమా మినిమమ్ పాజిటివ్ టాక్ అందుకోలేదు. ఆఫీసర్ సినిమా తరువాత సైలెంట్ అయిపోయిన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తో కొంత ఊపు తెచ్చినప్పటికీ సినిమా తెరపైకి వచ్చేసరికి బెడిసికొట్టినట్లు రివ్యూలు వెలువడుతున్నాయి. 

క్రిటిక్స్ నుంచి వర్మకు పూర్తి స్థాయిలో ప్రశంసలు అందడం లేదు. సినిమాకు 1 లేదా 2 స్టార్స్ ఇచ్చేసి చెత్తగా ఉందని బాటమ్ లైన్ తో వర్మకు కౌంటర్లు పడుతున్నాయి. దాదాపు టాప్ వెబ్ సైట్స్ లలో సినిమాకు 3 స్టార్స్ కూడా రాకపోవడం చూస్తుంటే సినిమా రిజల్ట్ ఏమిటో అర్దమైపోతోంది. ఇక మొదటి వారం కలెక్షన్స్ బట్టి సినిమాకు రివ్యూలా ఎఫెక్ట్ ఎంతవరకు పడింది అనే విషయంలో క్లారిటీ వస్తుంది. 

ఓపెనింగ్స్ అయితే గట్టిగానే వస్తాయి కానీ మిగతా రోజుల్లో కూడా అదే తరహాలో కలెక్షన్స్ రావాలి అంటే ఫుల్ పాజిటివ్ టాక్ రావాలి. కానీ వర్మ ఊహించినట్లు పరిస్థితి కనిపించడం లేదు. మరి సినిమా ఆదివారానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు సత్తా చాటుతుందో చూద్దాం.