విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అసలైన సప్సెన్స్ ను నేడు రివీల్ చేశాడు. ఎన్టీఆర్ పాత్రను విడుదల చేసి ఒక్కసారిగా లక్ష్మిస్ ఎన్టీఆర్ క్లిక్ అయ్యేలా చేశాడు. నేడు ఎన్టీఆర్ వర్థంతి సందర్బంగా నందమూరి ఫ్యామిలీ ఫొటోలతో ఎంతో హంగామా చేయగా ఇప్పుడు వర్మ ఏకంగా వీడియో వదిలి ఇతనే ఎన్టీఆర్ అని చెప్పాడు. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఇదివరకే లక్ష్మి పార్వతికి సంబందించిన పాత్రను అలాగే చంద్రబాబు పాత్రను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అవి వైరల్ అయ్యే లోపే ఇప్పుడు సరికొత్త వీడియోతో ఆర్జీవీ మరో టాపిక్ కు శ్రీకారం చుట్టాడు. అయితే ఎన్టీఆర్ లుక్ అంతగా వర్కౌట్ అవ్వలేదని అనిపిస్తోంది. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ చివరి దశలో లక్ష్మి పార్వతి ప్రవేశించిన అనంతరం ఎలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి అనే అంశాలను వర్మ చూపించనున్నాడు. అయితే  65+ వయసులో ఉన్న ఎన్టీఆర్ ని వర్మ తన సినిమా కోసం సెట్ చేసుకున్నాడు. ఇక ఆ లుక్ లో కనిపిస్తోన్న వ్యక్తి అయితే అంతగా సెట్టవ్వలేదని టాక్ వస్తోంది. మరి సినిమాలో ఆ లుక్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.