టాలీవుడ్ లో గత కొంత కాలంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా ఎన్నో వివాదాల అనంతరం వర్మ సినిమాను విడుదల చేయడానికి సిద్దమయ్యాడు. సినిమాకు సెన్సార్ బోర్డు ఊహించని విధంగా క్లీన్ U సర్టిఫికెట్ ను ఇచ్చింది. 

సినిమాను అన్ని వర్గాల వారు చూడవచ్చని వర్మ సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ నిర్మాతను విచారణ చేసిన అనంతరం సినిమా అన్ని సమస్యలను ధాటి థియేటర్స్ కి రాబోతున్నట్లు అర్థమైపోయింది. 

ఇక వర్మ ఎప్పటిలానే తన ప్రమోషన్స్ డోస్ ను మరింతగా పెంచేశాడు. సాధారణంగా వర్మ సినిమాలకు యూ సర్దిఫికేట్స్ రావు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఊహించని విధంగా U వచ్చింది. దీంతో వర్మ కెరిర్ లో ఇదో స్పెషల్ రికార్డ్ అని చెప్పవచ్చు.