సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

సినిమా బాగుందని, ఇలాంటి కథను ధైర్యంగా తెరకెక్కించిన వర్మ గట్స్ ను మెచ్చుకోకుండా ఉండలేమని అంటున్నారు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య జరిగిన ఓల్డేజ్ లవ్ స్టోరీని నేటితరానికి నచ్చేలా అధ్బుతంగా తీశారట. 

కళ్యాణి మాలిక్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అని అంటున్నారు. లక్ష్మీపార్వతి రోల్ లో యజ్ఞాశెట్టి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రలో పి.విజయ్ కుమార్ చక్కగా నటించారని కొనియాడుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లక్ష్మీపార్వతి గురించి కాస్త ఎక్కువగా చూపించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉందని అంటున్నారు. చంద్రబాబు  నాయుడు సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేదని టాక్. ట్విట్టర్ లోప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమందికి సినిమా నచ్చితే మరికొందరు మాత్రం అంతేం లేదని తీసిపారేస్తున్నారు.