దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. దివంగత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే అంశాలతో సినిమాను తెరకెక్కించారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి మొదటి వారంలో వస్తుందనుకుంటే.. మార్చి 15న వస్తుందని అన్నారు.

కానీ ఇప్పుడు సినిమాను మార్చి 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. 

దీనిపై స్పందించిన వర్మ ఆ వార్తల్లో నిజాలు లేవని డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇంకా ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు. కళ్యాణ్ కోడూరి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు.