సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీలో మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఎన్టీఆర్ జీవిత చరిత్రని లక్ష్మీపార్వతి కోణంలో వెండితెరపై చూపించాడు వర్మ. ఈ సినిమా ఓ వర్గపు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటుంటే  కొందరు మాత్రం ఈ సినిమాను విమర్శిస్తున్నారు.

ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే.. సుమారు సుమారు 550 థియేటర్స్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నించగా.. చివర్లో హైకోర్ట్ స్టేతో నైజాంలో 250 థియేటర్స్‌లో మాత్రమే విడుదల చేశారు. దీంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది.

అమెరికాలో 125 స్క్రీన్స్ పై భారీగా విడుదలైన ఈ సినిమా మొదటిరోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క ప్రీమియర్ షోల ద్వారా 90,214 డాలర్లను రాబట్టింది. ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారం జోరు మరింత పెరిగింది. గురు, శుక్రవారాలను కలుపుకొని 145,928 డాలర్ల ఓపెనింగ్స్ రాబట్టింది.