నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకం పై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కుతున్న "లక్మిస్ వీరగ్రంధం" కి సంభందించిన ఒక  ట్రైలర్ అని చిన్న క్లిప్పింగ్ ను రిలీస్ చేశారు 

"

దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ " ప్రస్తుతం బెంగళూరు నందు చిత్రం లోని ప్రధాన సన్నివేశాల ను చిత్రికరించటం జరుగుతుంది. ఈ చిత్ర కధాంశం ఒక యదార్థ సంఘటల ఆధారం. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత కీలకమైన సంఘటలను ఉన్నది ఉన్నట్లు చిత్రికరించటం జరిగింది. ఆయన తుది దశ లో ఎదురుకొన్న అత్యంత అవమానకరమైన ,కీలకమైన సన్నివేశాలు ప్రేక్ష్కలకు జనరంజకంగా చిత్రికరించే మహా యజ్ఞం లో తానూ ఉన్నట్లు ,ఈ చిత్రం ఎవ్వరిని ఉదేశించిసించి తియ్యటం లేదని ,ఒక యదార్ధం ను ప్రజల ముందు ఉంచు ప్రయత్నమైనదని అన్నారు. 

అలాగే ఎన్టీఆర్ తెరవని ఒక గ్రంధాన్ని తెరవాలనే సంకల్పమై ఈ చిత్ర నిర్మాణం నాకు దారి తీసిందని,ఏప్రిల్ మొదటి వారం లో చిత్రం రిలీజ్ కానున్నదని ,ఇదివరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇటువంటి రాజకీయ చిత్రలు గతంలో చూడని ఒక దుష్యకావ్యం గా తెరకెక్కుతుoదని "దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన ఆశాభావం వ్యక్తం చేశారు