మొదట  ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాసేందుకు  ఆయన ఇంట్లోకి అడుగుపెడతారు. ఎన్టీఆర్ రాజకీయల్లో బిజీగా ఉండగా మరో సినిమా చెయ్యాలని కోరుతూ మోహన్ బాబు పాత్ర కూడా అప్పుడే ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ తరుణంలో ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ మీటింగ్ జరుగుతుండగా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కూడా ఎంట్రీ ఇస్తుంది. 

అప్పుడే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఇంట్లో ఉండటంపై మీడియాలో అనేక పుకార్లు వస్తాయి. ఎన్టీఆర్ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరుగుతుంది. అప్పుడే లక్ష్మీ పార్వతి తో పెళ్లి విషయాన్ని ప్రస్తావించిన వారు ఒప్పుకోరు.

ఇక అందరికి తెలిసేలా మేజర్ చంద్రకాంత్ సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి పెళ్లి విషయాన్ని ప్రకటిస్తారు. అప్పుడే సినిమా ఇంటర్వెల్ కి చేరుతుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం బోర్ అనిపిస్తుంది. కానీ నెగిటివ్ అంశాలతో వర్మ చంద్రబాబును హైలెట్ చేశాడు.

ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ల మధ్య ఫ్యామిలీ సాంగ్ ని బాగానే ఎలివేట్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో అసలైన అంశాన్ని మరింత స్ట్రాంగ్ గా చూపించే ప్రయత్నం చేశారు. కేవలం చంద్రబాబే అన్నిటికి కారణం అన్నట్లుగా కథ సాగుతుంటుంది. లక్ష్మీ పార్వతిపై వస్తున్న నెగిటివ్ ప్రచారం అంతటి వెనుక ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఒక్కరే అన్నట్లుగా చూపంచారు.

1994 ఎన్నికల కోసం ఎన్టీఆర్ పార్టీ టిక్కెట్లను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. ఇక అనుగుణంగా గర్జన పాట వస్తుంది. ఎన్నికల్లో పార్టీ గెలవగానే ఎన్టీఆర్ తన పార్టీ సభ్యులతో కలిసి విజయాన్ని పంచుకుంటారు . అప్పుడే  అసలైన ఘట్టం వెన్నుపోటుకి ప్లాన్ సిద్ధమవుతుంది.

చంద్రబాబు వార్తా పత్రిక యజమానితో ఉన్నట్లు చూపిస్తూ లక్ష్మి పార్వతిని దిగజార్చడానికి ప్లాన్ చేస్తూ పార్టీని తన చేతుల్లోకి లాక్కునేందుకు ట్రై చేస్తారు ఇక వెన్నుపోటు అంశాన్ని మరింత స్ట్రాంగ్ గా ఎలివేట్ చేస్తూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను భయపెట్టి వారి సంపూర్ణ మద్దతుతో చంద్రబాబు సీఎం అయినట్లు చూపించారు. 

చంద్రబాబుకు సపోర్ట్ గా  అశోక్ గజపతిరాజు  దేవేందర్ గౌడ్ లను కూడా అదే తరహాలో స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. ఫైనల్ గా సినిమా ఎండింగ్ కి వచ్చేసరికి  వైస్రాయ్ ఎపిసోడ్ ను చూపిస్తారు. అప్పుడే దగా వెన్నుపోటు సాంగ్ వస్తుంది. 

అసెంబ్లీలో మెజార్టీ దక్కడంతో బాబు సీఎంగా అధికారం అందుకుంటారు.  ఆ బాధ తట్టుకోలేక ఎన్టీఆర్ కన్నుమూసినట్లు చూపిస్తారు. చివరికి ఎన్టీఆర్ చనిపోగానే నిజమైన పార్థివ దేహాన్ని చూపిస్తూ సినిమకు ఎండ్ కార్డ్ వేస్తారు.