సౌత్ నార్త్ అని తేడా లేకుండా వరుసగా వచ్చిన అవకాశాల్ని వదలకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బ్యూటీ లక్ష్మి రాయ్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ బ్యూటీ మీటూ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మీటూ ఉద్యమాన్ని కొందరు స్వార్థపూరితంగా కావాలని పబ్లిసిటీ కోసం వాడుకున్నట్లు కామెంట్ చేసింది.  

లక్ష్మి రాయ్ నటించిన వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి సినిమా నేడు రిలీజయ్యింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా .ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ హాట్ బ్యూటీ మీటూపై  ఈ విధంగా వివరణ ఇచ్చింది.  

ఇండస్ట్రీలో ఎదురైనా చేదు అనుభవాల గురించి చాలా మంది ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారు. కానీ కొందరు ప్రతీకారంతో అలాగే పబ్లిసిటీ కోసం దాన్ని వాడుకోవడంతో స్వార్ధం వల్ల ఉద్యమం పక్కదారి పట్టింది. ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి వచ్చింది.  మీటూ ఉద్యమాన్ని  అందరూ మర్చిపోయారు. అని కేవలం కొందరు స్వార్ధం కోసం కొందమంది వాడుకోవడం వల్ల పక్కదారి పట్టిందని లక్ష్మి రాయ్ వివరణ ఇచ్చారు.