విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నాడేంటబ్బా అనుకుంటున్నా సమయంలో ఊహించని విధంగా బాంబ్ పేల్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అటకెక్కినట్లు వార్తలు అప్పట్లోనే హల్ చల్ చేశాయి. 

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నాడేంటబ్బా అనుకుంటున్నా సమయంలో ఊహించని విధంగా బాంబ్ పేల్చాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అటకెక్కినట్లు వార్తలు అప్పట్లోనే హల్ చల్ చేశాయి. అయితే ఆ సినిమా ఆగిపోలేదని వర్మ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

ఇకపోతే వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ పై లక్ష్మి పార్వతి స్పందించారు. నందమూరి తారకరామారావు గారిపై కల్పితాలతో సినిమాను తెరకెక్కిస్తే కోర్టుకు వెళతానని అన్నారు. నా జీవితం అలాగే ఎన్టీఆర్ తో అనుబంధంపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉండాలి. నాకు ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయాన్ని ఆ సినిమాలో చూపించాలి.ఎన్టీఆర్ బయోపిక్ లో నా పాత్ర లేదు. అది మొదటి పార్ట్ మాత్రమేనని అన్నారు. 

ఇక రెండో పార్ట్ ను తెరకెక్కించే దైర్యం వారికి ఎంతమాత్రం లేదని చెబుతూ.. నాతో రామ్ గోపాల్ వర్మ మాట్లాడలేదు. కథ గురించి చర్చించలేదు. నా పేరు పెట్టుకున్నారు కాబట్టి ఉన్నది ఉన్నట్లు తెరకెక్కించాలని లక్ష్మి పార్వతి వివరణ ఇచ్చారు. అదే విధంగా రెండు సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులే చెప్పాలని, మొదట ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ చెయ్యాలని అన్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.