ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కించినా.. ఎక్కడా తన ప్రస్తావన తీసుకురాలేదని, సినిమాలో తనను చూపిస్తే ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయాన్ని చూపించాలని, ఆ ధైర్యం బాలకృష్ణకి లేదని సంచలన కామెంట్స్ చేసింది లక్ష్మీపార్వతి. దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ 'మహానాయకుడు' చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరించాడు.

మొదటి భాగం సంక్రాంతికి విడుదల కాగా రెండో భాగం 'మహానాయకుడు' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథలో ఎన్టీఆర్ పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం ప్రచారం చేయడం, దేశ రాజకీయాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు, ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించడం వంటి విషయాలను చూపించారు. కానీ సినిమాలో లక్ష్మీపార్వతి ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు.

ఈ విషయంపై స్పందించిన లక్ష్మీపార్వతి.. తను సినిమా చూడలేదని కానీ అందరూ ఇది బయోపిక్ లా లేదని అంటున్నట్లు చెప్పింది. సినిమాలో చంద్రబాబు గొప్పతనమే చూపించారని, ఈ విషయం తనకు ముందే తెలుసునని అంది. ఎన్టీఆర్ బయోపిక్ లో వాస్తవాలు చూపించే ధైర్యం బాలయ్యకి లేదని, చంద్రబాబుతో అన్ని లింకులు పెట్టుకున్న బాలయ్య తన తండ్రికి జరిగిన ద్రోహాన్ని ఎలా చూపిస్తానని కామెంట్స్ చేసింది.

సినిమాలో తన ప్రస్తావన తీసుకొస్తే ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయాన్ని చూపించాలని ఆ ధైర్యం వాళ్లకు లేదని, వాస్తవాలు లేవు కాబట్టే జనాలు కూడా ఈ సినిమాకి సరైన తీర్పునిచ్చారని విమర్శలు చేసింది. రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను వాస్తవికతతో చూపించబోతున్నారని చెప్పింది. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. 

ఇది 'బాబు' బయోపిక్ (ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు రివ్యూ)