రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో 2011లో వచ్చిన కాంచన సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆ సినిమా కథ రూపొందుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం స్పెషల్ గా రెడీ అవుతున్నాడు.  ఇప్పటికే వర్కౌట్స్ చేసి ఫిట్ నెస్ లో మార్పులు చేశాడు. 

సినిమాకు లక్ష్మి బాంబ్ అని టైటిల్ ని కూడా సెట్ చేశారు. అయితే ఏప్రిల్ లోనే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. టైటిల్ ఫస్ట్ లుక్ విషయంలో తన అనుమతి లేకుండా నిర్ణయం తీసుకున్నారని అలాగే సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పకుండా ఎనౌన్స్ చేయడంతో దర్శకుడు లారెన్స్ అప్పట్లో సినిమా చేయనని తప్పుకున్నాడు. ఇక అక్షయ్ బుజ్జగించి సినిమాను రీ స్టార్ట్ చేశారు. 

ఇక సినిమాను ఎలాగైనా 2020 జూన్ 5న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ టార్గెట్ గాపెట్టుకుంది. ప్రస్తుతం ముంబై లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తెలుగు తమిళ్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్న కాంచన కథ బాలీవుడ్ లో ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.