నటీనటులు: మంచు విష్ణు, హన్సిక మోత్వాని, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్‌, పోసాని, ప్రభాస్‌ శ్రీను, సత్యంరాజేష్‌ సంగీతం: అచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు స్క్రీన్‌ప్లే, మాటలు: డైమండ్‌ రత్నబాబు నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ కథ, దర్శకత్వం: రాజ్‌కిరణ్‌ ఏసియానెట్ రేటింగ్ : 2.5/5

కథ:
జె.కె.(ఎం.వి.వి.సత్యనారాయణ) అనే రౌడీ పాతిక కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. అనుకున్న వెంటనే తన ప్లాన్‌ను అమలు చేస్తాడు. కానీ జె.కె. దగ్గర పని చేసే ఒకడు ఆ డబ్బు మొత్తం కొట్టేసి జె.కె.ని మోసం చేస్తాడు. ఇదిలా ఉండగా.. లక్కీ(మంచు విష్ణు)కి తన పేరులో ఉన్న అదృష్టం తన జీవితంలో మాత్రం ఉండదు. లక్కీ పుట్టగానే వచ్చిందనుకున్న ఆస్తి మొత్తం పోతుంది. కొడుకు దురదృష్టం వలనే అలా జరిగిందని తన తండ్రి నమ్ముతాడు. పెరిగి పెద్దయిన తరువాత కూడా ఇంటికి కీడు జరుగుతుండడంతో కొడుకుని లక్కీ అని పిలవడం కూడా మానేస్తాడు. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేయాలనుకున్న లక్కీ ఓ ఆఫీస్‌లో ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ పద్మావతి(హన్సిక) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ.. ఆ అమ్మాయి వెంట తిరుగుతూ ఉంటాడు. పద్మావతి కూడా లక్కీని ప్రేమిస్తుంది. తన కోసం ఏదైనా ఉద్యోగం చేయమని అడగగా పిజ్జా డెలివరీ బాయ్‌గా జాయిన్ అవుతాడు లక్కీ. అదే సమయంలో తన చెల్లెలికి పెళ్లి కుదిరిందని తెలియడంతో పద్మావతితో కలిసి ఊరికి బయలుదేరతాడు. 

చెల్లికి ఇవ్వాల్సిన కట్నం డబ్బు పాతిక లక్షలు లక్కీకి ఇచ్చి మగపెళ్లి వారికి ఇవ్వమని చెబుతుంది అతని తల్లి. ఆ డబ్బు తీసుకొని వెళ్లి లక్కీ ఇచ్చేసినా.. పెళ్లి కొడుకు తండ్రికి మతిమరుపు ఉండడంతో డబ్బు ఇవ్వలేదని చెబుతాడు. దీంతో లక్కీ తండ్రి కొడుకు తనను మోసం చేశాడని ఛీ కొడతాడు. ప్రేమించిన అమ్మాయి కూడా వదిలివెళ్లిపోతుంది. ఆ సమయంలో చచ్చిపోవాలనుకున్న లక్కీ దగ్గరకు డబ్బు కొట్టేసిన వ్యక్తి వచ్చి ఒక బ్యాగ్ ఇస్తాడు. ఆ బ్యాగ్ ఒకరోజు తన దగ్గర పెట్టుకుంటే కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేస్తాడు. దానికి లక్కీ సరే అంటాడు. ఆ తరువాత ఏం జరిగింది..? లక్కీకి ఆ బ్యాగ్‌లో పాతిక కోట్లు ఉన్నాయనే విషయం తెలుస్తుందా..? తెలిస్తే ఏం చేస్తాడు..? చివరకు ఆ డబ్బు ఎవరి చేతికి వెళ్లింది..? లక్కీని తన ఇంట్లో వారు, ప్రేమించిన అమ్మాయి దగ్గరకు తీసుకున్నారా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే! 


ఎలా ఉందంటే: 
సినిమా కథ కొత్తదని చెప్పలేం కానీ.. ఆసక్తికర కథనంతో సినిమాను నడిపించాలనుకున్నారు. అది కాస్త చూసే ప్రేక్షకుడికి రొటీన్ అనిపించక మానదు. సినిమా మొదటి భాగం మొత్తం పాత్రలను పరిచయం చేయడం, రెండు మూడు కామెడీ సీన్లు, రెండు పాటలు, ఓ లవ్ ట్రాక్, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో నడిపించేశారు. ఇంటర్వల్ బ్యాంగ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అప్పటివరకు లక్ లేదని బాధ పడే వ్యక్తికి సడెన్‌గా అదృష్టం కలిసొస్తుంది. పరాయి సొమ్ముకి ఆశ పడని హీరో దగ్గరకు అనుకోకుండా పాతిక కోట్లు వస్తే ఏం చేశాడనేది ఆసక్తికరం. మంచు విష్ణు ఎప్పటిలానే తన స్టయిల్‌లో పెర్ఫార్మ్ చేశాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోలానే తన పాత్ర కూడా ఉంటుంది. ఎక్కడా.. కొత్తదనం ఉండదు. హన్సికకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదు. పాటలు, లవ్ సీన్స్‌లో తప్ప ఆమె పాత్రను కొత్తగా డిజైన్ చేయలేదు. స్క్రీన్ మీద కూడా హన్సికను అందంగా చూపించలేకపోయారు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో హన్సిక గ్లామర్ తగ్గిందనే చెప్పాలి. 

విష్ణు, హన్సిక ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోవు. తండ్రి సెంటిమెంట్‌ను తెరపై బాగానే చూపించారు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించే హీరోయిన్ తండ్రి పాత్రలో తనికెళ్ల భరణి హాస్యాన్ని పండించారు. తమిళ నటుడు జయ ప్రకాష్ చక్కగా నటించారు. వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్‌ల కామెడీ పండింది. విలన్ పాత్రలో ఎం.వి.వి.సత్యనారాయణ ఫర్వాలేదనిపించారు. అలానే సెకండ్ హాఫ్‌లో పోసాని కృష్ణ మురలి తనదైన శైలిలో ప్రేక్షుకుల్ని ఆకట్టుకున్నారు. టెక్నికల్‌గా సినిమా పెద్దగా ఆకట్టుకోదు. అనుకున్న కథ, నడిపించిన కథనం ఏది ఆకట్టుకోదు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుర్తుపెట్టుకునే విధంగా లేవు. సినిమాటోగ్రఫీ కూడా అంతంతమాత్రంగా ఉంది. ఎడిటింగ్ వర్క్ ఒకే అనిపించింది. లక్కున్నోడు‌గా వచ్చిన మంచు విష్ణు లక్ ఈ సినిమాకు పని చేయలేదనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెపుకోవలసింది ఫస్టాఫ్ గురించి. సినిమా మొదలుపెట్టడమే కాస్త డిఫరెంట్ గా, ఆసక్తికరంగా స్టార్ట్ చేశాడు దర్శకుడు రాజ్ కిరణ్. పైగా ఫస్టాఫ్ లో వచ్చే ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ ల కామెడీ చాలా చోట్ల నవ్వించింది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్స్ రెండూ బాగున్నాయి. సూపర్ టైమింగ్ తో నడిచే ఆ రెండు సన్నివేశాలు కొత్తగా ఉండి కథను మలుపు తిప్పుతూ బాగా కనెక్టయ్యాయి.

అలాగే సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చే పోసాని కృష్ణ మురళీ కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయింది. హీరో మంచు విష్ణు ట్రై చేసిన పాత్ర కాస్త కొత్తగానే అనిపించింది. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ లో తండ్రీ, కొడుకుల మధ్య దూరం ఎలా పెరిగిందో చూపడానికి రన్ చేసిన సన్నివేశాలు, ప్రస్తుతంలో హీరో అకారణంగా తండ్రి ముందు మరింత లోకువ అయ్యే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ హన్సిక కనిపించిన ప్రతి ఫ్రేమ్ లో అందంగా ఉంటూ ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ అంటే సెకండాఫ్ అనే చెప్పాలి. ఒక్క పోసాని కృష్ణ మురళీ కామెడీ మినహా రెండవ అర్థ భాగం ఎక్కడా ఆకట్టుకోలేదు. ఆద్యంతం రొటీన్ స్క్రీన్ ప్లేతో నడుస్తూ ప్రతి సీన్ ఊహాజనితంగా ఉంటూ బోర్ కొట్టించింది. విలన్ పాత్ర కూడా సినిమాకి మరో పెద్ద డ్రా బ్యాక్. ఆ పాత్రలో ఎక్కడా బలం కనిపించలేదు. దీంతో సినిమా సీరియస్ గా నడవాల్సిన చోట సైతం బలహీనపడిపోయి చాలా చోట్ల తేలిపోయింది.

ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ లో ఎక్కడా రొమాంటిక్ యాంగిల్ అనేదే కనిపించలేదు. చాలా సాదాసీదాగా ఉంటూ కాస్త విసిగించింది కూడా. కథ మధ్యలో వచ్చే పాటలు కూడా ఏమంత గొప్పగా లేక సినిమాకి పెద్దగా ఉపయోగపడలేకపోయాయి. కథలో హీరో చుట్టూ మంచి కుటుంబపరమైన ఎమోషన్ ను బిల్డప్ చేసి క్లైమాక్స్ లో ప్రేక్షకులకు కనెక్టయ్యే విధంగా రిజల్ట్ ఇవ్వడంలో దర్శక రచయితలు విఫలమయ్యారు. దీంతో ప్రేక్షకుల్లో అసంతృప్తి బలంగా మిగిలింది. సెకండాఫ్ లో కథ పూర్తిస్థాయిలో ఏదైనా ఒక అంశం మీద పోకుండా పలు విధాలుగా నడుస్తూ కన్ఫ్యూజ్ చేసింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రాజ్ కిరణ్ ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితికి తగ్గట్టు కథను బాగానే ఆరంభించినా దాన్ని పూర్తి స్థాయిలో ప్రేక్షకుడికి కనెక్టయ్యే విధంగా చెప్పడంలో విఫలమయ్యాడు. ఇక రచయిత డైమండ్ రత్నబాబు మాటలు, ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే బాగున్నా సినిమాకు సెకండాఫ్ కు ఆయన అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయింది. పి.జి.విందా సినిమాటోగ్రఫీ బాగుంది. అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజుల సంగీతం పర్వాలేదు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా: లక్కున్నోడు కాస్త లక్కుంటే కామెడీ కోసం ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారు.