ఇన్నాళ్లు కీచక ఉపాధ్యాయులను చూసి ఆడపిల్లలకు రక్షణ లేదు బాబోయ్ అంటూ కొంతమంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను బడిమానిపించి  వేశారు. ఇప్పుడు ఇది చదివితే తమ కొడుకులను కూడా బడికి పంపిచడం మానేస్తారేమో! మగ,ఆడ అన్న తేడాలేకుండా కామంతో కళ్ళు మూసుకపోయిన కొంతమంది చిన్న, పెద్దని భేదం లేకుండా లైంగికదాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతూ ఉంది.

 

 

తన కామదాహాన్ని తీర్చుకోవడానికి ఒక పంతులమ్మ ఏకంగా ఒక విద్యార్థిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని న్యూ స్మైండ్రా బీచ్ నగరంలోని వోలుసియా కంట్రీ స్కూల్స్‌లో స్టెఫానీ ఫెర్రీ అనే యువతి సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది. 8 వ క్లాస్ లో చదువుతున్న ఒక విద్యార్థి పై మోజుపడి అతనితో ఎలాగైనా పడక సుఖం పంచుకోవాలనుకుంది. ఇందుకోసం అతడిని ఫెయిల్ చేస్తానని బెదిరించి పలుమార్లు అతనిని అత్యాచారం చేసింది. 

 

విద్యార్థికి  మత్తుపదార్థాలను ఇవ్వడం, ఇంటికి పిలిపించుకొని మరీ శృంగార కార్యకలాపాలను చేసేది. దీంతో ఆమె బెదిరింపులకు విసిగిపోయిన విద్యార్థి మరో టీచర్ తో జరిగిన విషయన్ని పంచుకున్నాడు. దీంతో ఖంగుతిన్న ఆ టీచర్.. విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. విచారణలో అసలు విషయం బయటపడింది. విద్యార్థికి, టీచర్ తన నగ్న చిత్రాలు పంపేదని, పలుమార్లు అత్యాచారం చేసిందని విచారణలలో తేలింది. ప్రస్తుతం కోర్టు ఆమెకు 25000 డాలర్ల పూచికత్తుపై బెయిల్ ను మంజూరుచేసింది.