MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode Feb 2: అత్తారింటిలో అమూల్య విశ్వరూపం, భర్త మీదకే కత్తితో దాడి

Illu Illalu Pillalu Today Episode Feb 2: అత్తారింటిలో అమూల్య విశ్వరూపం, భర్త మీదకే కత్తితో దాడి

Illu Illalu Pillalu Today Episode Feb 2: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య ఇన్నాళ్లు కనిపించినట్టు సున్నితంగా ఉండదు. విశ్వక్ నే భయపెట్టే స్థాయిలోకి మారింది. ఇక రామరాజుకు గుండెపోటు వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Feb 02 2026, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గుండెపోటుతో రామరాజు
Image Credit : Jio hotstar

గుండెపోటుతో రామరాజు

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ లో వేదవతి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ‘నా కడుపున చెడబుట్టింది, పుట్టగానే చంపేసిన అమూల్యను బాగుండేది’ అని అరుస్తుంది. దానికి నర్మద ‘అమూల్య అలా చేయదు దీని వెనుక ఏదో కుట్ర జరిగింది’ అని అంటుంది. దానికి ‘నేను పెళ్లి చేసుకొని వచ్చాను ఆశీర్వదించండి అని దాని నోరు తోనే చెప్పింది. అలాంటి దాన్ని వెనకేసుకుని రావద్దు’ అని చెబుతుంది. ఈలోపు రామరాజు కుర్చీలో కూలబడిపోయి అమూల్య సేనాపతి ఇంట్లోకి వెళ్లడం, పెళ్లి చేసుకున్నానని చెప్పడం పదేపదే గుర్తు చేసుకుంటాడు. తన బిడ్డ ఆ ఇంట్లో ఉండడం ఏంటి? అక్కడ సేఫ్ గా ఉండదు అంటూ గాభరాపడతాడు. అమూల్య చిన్నపిల్ల దానికి ఏం తెలియదు అంటూ ఏడుస్తాడు.

రామరాజు ఏడుస్తూ కింద పడిపోతాడు. దీంతో రామరాజు కొడుకులు, కోడళ్ళు, వేదవతి అందరూ గాభరా పడిపోతూ ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్తారు. రామరాజుని కారులో ఎక్కిస్తుంటే పైనుంచి సేనాపతి, భద్రావతి చూసి చాలా ఆనంద పడతారు. భద్రావతి ‘ఒరేయ్ రామరాజు ఈరోజు నుంచి నీ పతనం మొదలైందిరా’ అంటూ ఆనందంతో నవ్వుకుంటూ ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అత్తారింటిలో అడుగుపెట్టిన అమూల్య
Image Credit : Jio hotstar

అత్తారింటిలో అడుగుపెట్టిన అమూల్య

ఇక్కడి నుంచి సీన్ అమూల్య దగ్గరికి మారుతుంది. పెద్దమ్మ అమూల్యను, విశ్వక్ ను గుమ్మం దగ్గర నిలబెడుతుంది. విశ్వక్ తల్లి రేవతి వారిద్దరికీ హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. కుడికాలు లోపలికి పెట్టి రమ్మని చెబుతుంది. కానీ అమూల్య ఎడమకాలు లోపలికి పెట్టి వెళుతుంది. విశ్వక్ కోపంగా అమూల్యను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు.

రామరాజును ఆస్పత్రిలో చేర్పిస్తారు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు నర్మద, ప్రేమ, వేదవతి అందరూ ఆసుపత్రికి చేరుకుంటారు. డాక్టరు బయటకు వచ్చి వేదవతి తో రామరాజుకి తీవ్రమైన గుండె పోటు వచ్చిందని చెబుతాడు. దీంతో వైద్యులు కొన్ని వివరాలు అడుగుతారు. ఆయనకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేక ఏదైనా షాకింగ్ వార్త లాంటివి విన్నారా అని అడుగుతాడు. భాగ్యం అసలు విషయం డాక్టర్ కి చెప్పేస్తుంది. వల్లీ ఆపుతుంది కానీ భాగ్యం డాక్టర్ అడిగినప్పుడు చెప్పాలి అని చెప్పి అమూల్య పెళ్లి చేసుకున్న సంగతి డాక్టర్ కి చెబుతుంది. దాంతో డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెబుతాడు. మరోపక్క వేదవతి తన భర్తకు గుండెపోటు రావడం ఏమిటి అంటూ ఏడుస్తూనే ఉంటుంది.

Related Articles

Related image1
Illu Illalu Pillalu Today Episode Jan 30: విశ్వక్‌కే షాకిచ్చిన అమూల్య, ఇకపై అతడికే భార్య
Related image2
Illu Illalu Pillalu:భద్రావతి ఇంట ఎడమ కాలు పెట్టిన అమూల్య... ఆగిపోయిన రామరాజు గుండె
34
అమూల్యకు ధైర్యం చెప్పిన పెద్దమ్మ
Image Credit : Jio hotstar

అమూల్యకు ధైర్యం చెప్పిన పెద్దమ్మ

ఇక అమూల్య జరిగింది తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది. అమ్మ ఇంటి దగ్గరికి విశ్వక్ వాళ్ళ అమ్మ రేవతి వస్తుంది. ‘నువ్వు, విశ్వ ప్రేమించుకున్నారని పెళ్లి చేసుకున్నారని చెప్పారు. మరి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? ఈ రెండిళ్ల మధ్య గొడవలు నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు. మరి ఈ ఇంటికి కోడలుగా నువ్వు అడుగుపెడితే నీకు పుట్టిల్లు శాశ్వతంగా దూరమైనట్టే అన్న ఆలోచన నీకెందుకు రాలేదు. ఇదంతా తెలిసి కూడా ఎందుకు ప్రేమించావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం’ అని అడుగుతుంది. ఈలోపు పెద్దమ్మ వస్తుంది. రేవతిని అడ్డుకొని అలా అమూల్యతో మాట్లాడవద్దని చెబుతుంది. ఇక అమూల్యతో మాట్లాడుతూ ‘నువ్వు ధైర్యంగా ఉండు. రెండిళ్లు దగ్గరయ్యే రోజు వస్తుంది’ అని చెబుతుంది.

మరోపక్క ఐసీయూలో రామరాజుకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ‘పిల్లల జీవితానికి ఏమైనా అయితే ఆయన తట్టుకోలేరు. అందులోనూ చిన్న కూతురు అంటే ఆయనకు ఇష్టం. దాని జీవితం నాశనం అయిందనే విషయం తట్టుకొనే శక్తి ఆ తండ్రి గుండెకు లేదు’ అని ఏడుస్తూనే ఉంటుంది. చాలాసేపు వేదవతి ఇలా ఏడుస్తూనే ఉంటుంది. ఎపిసోడ్లో ఎక్కువసేపు వేదవతి ఏడుపే కనిపిస్తుంది.

44
విశ్వక్ కే వార్నింగ్ ఇచ్చిన అమూల్య
Image Credit : Jio hotstar

విశ్వక్ కే వార్నింగ్ ఇచ్చిన అమూల్య

ఇక ఇక్కడినుంచి సీన్ విశ్వక్ దగ్గరికి మారుతుంది. సేనాపతి, భద్రావతి ఆనందంగా విశ్వక్ ను పిలుస్తారు. ఒక చైను తీసుకొచ్చి సేనాపతి విశ్వక్ మెడలో వేస్తాడు. ‘ఆ రామరాజు మీద పగ తీర్చుకున్న నీకే ఇది వేసుకునే అర్హత ఉంది. వాడి కూతుర్ని పెళ్లి చేసుకొని వాడిని చావు దెబ్బ కొట్టావ్ రా నువ్వు’ అని పొగుడుతాడు. భద్రావతి ‘రామరాజు ప్రాణం ఇప్పుడే పోవచ్చు లేదా వాడి కూతురు మన ఇంట్లో నరకం పడడం చూసి వాడి ప్రాణం మెల్ల మెల్లగా పోతుంది’ అని అంటుంది. విశ్వ అసలు విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా వీరిద్దరూ అవకాశం ఇవ్వరు.

ఈ లోపు పెద్దమ్మ వచ్చి ‘ఇంతవరకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు’ అని అడుగుతుంది. అప్పుడు సేనాపతి ‘మన ఇంటి ఆడపిల్లను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న ఆ రామరాజు కూతురు మనింటి పనిమనిషి అయ్యింది. అందుకే ఇంత ఆనందంగా ఉన్నాం’ అంటాడు. దానికి పెద్దమ్మ ‘నోర్ముయ్యండి పని పిల్ల కాదు కోడలు పిల్ల. ఆడపిల్ల ఆడపిల్ల కన్నీటికి సామ్రాజ్యాలే కూలిపోయాయి. ఆ పిల్లకు కంటతడి పెట్టించి ఆ శాపాన్ని జీవితకాలం మోయకండి. మీ అమ్మ దగ్గర నీ భార్య ఉంది నీ గదికి తీసుకెళ్ళు’ అని విశ్వకు చెబుతుంది. దానికి భద్రావతి ‘పనివాళ్లకు గదులు ఉండవు, ఒక మూల పడి ఉండాలి’ అని అంటుంది. దానికి పెద్దమ్మ కోపంగా ‘అది నీ తోడబుట్టిన చెల్లెలి కూతురు. దాన్ని నీ చెల్లెలు అనుకుని చూసుకోండి’ అని చెబుతుంది. తర్వాత రేవతిని పిలిచి ‘అమూల్యను నా చెల్లెలు శారదాంబ గదిలోకి తీసుకెళ్ళు. ఇకపై ఆమె అక్కడే ఉంటుంది’ అని చెబుతుంది.

మరొ పక్క ఐసియూలో రామరాజుకు ట్రీట్మెంట్ అవుతుంటే.. ధీరజ్ కన్నీటితో చూస్తూ ఉంటాడు. అప్పుడు ప్రేమ కూడా వచ్చి పక్కన నిలిచి ఉంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అమూల్య అత్తారింటిలో పిల్లిలా కాకుండా పులిలా మారుతుంది. ఏకంగా కత్తి పట్టుకుని విశ్వక్ నే బెదిరిస్తుంది. విశ్వక్ కూడా భయంగా అమూల్యతో మాట్లాడుతాడు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana: రామాయణ్‌పై టాక్సిక్‌ డిజాస్టర్‌ దెబ్బ, ప్రమోషన్‌లో వెనుకబాటు.. సైలెన్స్ కి కారణం ఇదేనా?
Recommended image2
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image3
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Jan 30: విశ్వక్‌కే షాకిచ్చిన అమూల్య, ఇకపై అతడికే భార్య
Recommended image2
Illu Illalu Pillalu:భద్రావతి ఇంట ఎడమ కాలు పెట్టిన అమూల్య... ఆగిపోయిన రామరాజు గుండె
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved