సల్మాన్ ఖాన్ కు ప్రపోజ్ చేసిన లేడీ రిపోర్టర్.. బాలీవుడ్ హీరో రిప్లై ఏంటంటే.. ?
60 ఏళ్ళు వస్తున్నా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అంతే కాదు. ఏమాత్రం ఇమేజ్ కూడా తగ్గలేదు. కుర్రభామలు ఆమనంటే మనసు పారేసుకుంటున్నారు. రీసెంట్ గా ఓ అమ్మాయి ప్రపోజ్ కూడా చేసింది పబ్లిక్ లో..

ఆరు పదుల వయసు ముంచుకువస్తున్నా.. ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు సల్మాన్ ఖాన్. హ్యాపీగా బ్యాచ్‌లర్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తున్నాడు బాలీవుడ్ ఖాన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ నడిపినన్ని ప్రేమ వ్యవహారాలు.. ఇంకే హీరో నడిపి ఉండడు. ఆయన ఖాతాలో ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు. అంతే కాదు బయట కూడా సల్మాన్ తో డేటింగ్ చేసినవారెందరో.. అంత మందితో కలిసి తిరిగాడు కాని.. ఎవరిని పెళ్ళి చేసుకోలేదు బాలీవుడ్ స్టార్ హీరో. ఇక సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం అటు ఫ్యాన్స్.. ఇటు ప్యామిలీలో అందరికి పోయింది. కాని ఆయనకు వచ్చే ప్రపోజల్స్ మాత్రం కంటీన్యూ అవుతూనే ఉన్నాయి.
ఇక సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి.. ప్రేమ వ్యావహారాల గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన చేసుకోడు.. ఒక వేళ బుద్ది మారి చేసుకుంటే.. ఎవరిని చేసుకుంటాడు అంటూ సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే సల్మాన్ కు మాత్రం లవ్ ప్రపోజల్స్.. పెళ్ళి ప్రపోజల్స్ మాత్రం ఆగడం లేదు. రీసెంట్ గా ఈ కండల వీరుడుకు ఓ ప్రపోజల్ వచ్చింది. అయితే సల్మాన్ తనకు ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు దాటిందంటూ ఆ ప్రపోజల్‌ను రిజక్ట్ చేశాడు.
ఐఫా-2023 వేడుకలు దుబాయ్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడకులకు బాలీవుడ్ నుంచి తారా తోరణం తరలి వెళ్లింది. అందులో సల్మాన్ స్పెషల్ గా నిలిచారు. అయితే ఈ వేడుకలో జరిగిన మీడియా సమావేశంలో సల్మాన్ మాట్లాడుతుండగా.. ఓ లేడీ రిపోర్టర్ ప్రపోజ్ చేసింది. సల్మాన్ మీ కోసమే నేను హాలీవుడ్ నుంచి వచ్చాను. మిమ్మల్ని చూసినప్పుడే నేను మీతో ప్రేమలో పడిపోయాను అని ఆమె చెప్పంది. అది వినగానే సల్మాన్ మీరు షారుక్ గురించి మాట్లాడుతున్నారు కదా అంటూ జోక్ వేశాడు. దాంతో ఆ రిపోర్టర్ లేదు నేను మీ గురించే మాట్లాడుతున్నా.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అని మళ్లీ అడిగింది.
ఇక ఆమె అలా అనడంతో సల్మాన్ వెంటనే స్పందించి.. నాకు పెళ్లి వయసు దాటిపోయింది. 20 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కలిసి ఉంటే బాగుండేది అని సరదాగా రిప్లై ఇచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పువ్లులు పూశాయి. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.