తాప్సి, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సాంధ్ కీ ఆంక్ నిర్మాతగా ఉన్న నిధి పర్మార్ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. 42ఏళ్ళ నిధి పార్మర్ తల్లి కావడం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యం కలిగిన నిధి పర్వాన్ తనకు కొడుకుకు చనుపాలు ఇస్తుంది. ఐతే తన బిడ్డకు పాలు ఇవ్వగా, చాలా పాలు మిగిలిపోతున్నట్లు ఆమె గ్రహించారు. 

తనలో మోతాదుకు మించి ఉత్పత్తి అవుతున్న పాలను ఏమి చేయాలో అర్థం కాక, మిత్రులను సలహా అడిగారట. దానికి ఆమె స్నేహితులు మెడిసిన్ తయారీ, ఆభరణాల తయారీకి ఉపయోగించాలని సలహా ఇచ్చారట. ఐతే అవేమి నచ్చని నిధి పర్వాన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. 

తన పాలను పాలు లేకుండా ఇబ్బంది పడుతున్న బిడ్డలకు దానం ఇవ్వాలని నిర్ణయించారు. కొంత మంది బాలింతలకు ఆరోగ్య కారణాల రీత్యా పాలు ఉత్పత్తి కావు. అలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న తల్లుల బిడ్డల కోసం ఆమె పాలు దానం చేస్తున్నారు. తల్లిపాలను ఎలా పాడవకుండా ఉండాలో ఆమె రీసెర్చ్ చేయడంతో పాటు, సరైన పద్దతిలో ఫ్రిజ్ లో ఉంది మూడు నాలుగు నెలలు దాచ వచ్చని తెలుసుకున్నారట. ఇప్పటి వరకు 40 లీట్లర్ల చను పాలను దానం చేసిందట నిధి పర్వాని.